Happy Life: బౌండరీలు సెట్ చేసుకుంటున్నారా?
Hyderabad: మనిషి ఎప్పుడూ జీవితంలో ఎలా నెగ్గాలి అనే ఆలోచిస్తుంటాడు. కానీ ఎక్కడ తగ్గాలో కూడా తెలిస్తేనే సక్సెస్ వైపు అడుగులు వేయగలం. అప్పుడు మనం కోరుకున్న హ్యాపీ, సక్సెస్‌ఫుల్ లైఫ్ మన సొంతం అవుతుంది. (happy life) అలాంటి లైఫ్ కావాలంటే మనం కొన్ని బౌండరీలు సెట్ చేసుకోవాలి. అవేంటో చూద్దాం.
ఈ బౌండరీల వల్ల ఉపయోగం ఏంటి?
బర్న్ అవుట్ (పని ఒత్తిడి) తగ్గుతుంది.
టైం ఎక్కువ ఉంటుంది.
సెల్ఫ్ రెస్పెక్ట్ పెరుగుతుంది.
మీకు నచ్చిందే చేస్తారు.
ఆరోగ్యకరమైన రిలేషన్‌షిప్‌లో ఉంటారు. (happy life)
ఎలా సెట్ చేసుకోవాలి?
కొందరు వ్యక్తులు కావాలనే మనకు నచ్చని విషయాలు అడిగి ఇబ్బంది పెడుతుంటారు. మనం చెప్పకపోతే.. అంతేలే మాతో ఎందుకు చెప్తావు అంటూ ఎమోషనల్ బ్యాక్‌మెయిల్ చేస్తుంటారు. అలాంటివాళ్లు మీ లైఫ్‌లో ఉంటే ముఖం మీదే వారికి నో చెప్పేయండి. లేదా నాకు ఈ విషయం గురించి మాట్లాడటం ఇష్టం లేదు అని గట్టిగా చెప్పేయండి. దీనిని ఎమోషనల్ బౌండరీ అంటారు.
ఇక మెటీరియల్ బౌండరీ గురించి తెలుసుకుందాం. అంటే ఇప్పుడు మీ దగ్గర ఉన్న దుస్తులు, కారు, బైక్ ఇలా ఏవైనా సరే.. మీకు తెలీకుండా లేదా మీ పర్మిషన్ తీసుకోకుండా ఎవరైనా వాడుకుంటున్నారనుకోండి.. మీకు నచ్చితే ఓకే. కానీ నచ్చకపోతే మాత్రం అప్పటికప్పుడు నో చెప్పేయండి. ఒకవేళ మీ పర్మిషన్ తీసుకుని మీ వస్తువు తీసుకుంటే అది ఎలా ఉందో అలాగే తిరిగి మీ దగ్గరికి చేరకోవాలి. పాడుచేసి ఇస్తే మాత్రం ఇంకెప్పుడు వారికి మీ వస్తువులు ఇవ్వకూడదు. (happy life)
మీకు ఓపిక లేని టైంలో లేదా మీకు వేరే పని ఉన్నప్పుడు ఎవరైనా బయటికి వెళ్దాం అని అడిగితే.. నో చెప్పేయండి. ఎందుకంటే వాళ్లు ఏదో అనుకుంటారని మొహమాటానికి పోయి వారితో బయటికి వెళ్తే.. మీ వర్క్ ఆగిపోతుంది. ఎవరి అభిప్రాయాలు వారికి ఉంటాయి. నలుగురిలో ఉన్నప్పుడు ఎవరైనా మీ మాటకు అభిప్రాయానికి విలువ ఇవ్వకపోతే వారికి ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన పనిలేదు. ఆఫీస్‌లో ఉన్నప్పుడు అలా వారిని వదిలేయలేం కాబట్టి.. మీ అభిప్రాయాన్ని క్లియర్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేసేందుకు ప్రయత్నించండి. అంతేకానీ.. ఎదుటివారికి నచ్చలేదు కదా అని మీ మనసు మార్చుకోవాల్సిన అవసరం లేదు. దీనిని మెంటల్ బౌండరీ అంటారు.
మీ రూంలోకి ఎవరైనా వచ్చినా, లేదా మీ వస్తువులను ముట్టుకోవాలని చూసినా మీకు నచ్చదు అనుకోండి. అలా చేయద్దు అని చెప్పేయండి. ఎందుకంటే అది మీ ఫిజికల్ బౌండరీ కిందకి వస్తుంది. ఈ బౌండరీలు అనేవి మన జీవితానికి చాలా ముఖ్యం. వాటిని మీకు నచ్చినట్లుగా సెట్ చేసుకోకపోతే జీవితాంతం ఇతరుల కోసం రాజీపడాల్సి వస్తుంది. దాని వల్ల మనమీద మనకే చిరాకేస్తుంది. ప్రొడక్టివిటీ తగ్గిపోతుంది. (happy life)