World Thalassemia Day: లక్షణాలు.. జాగ్రత్తలు
Hyderabad: ఎర్రరక్త కణాల(Red Blood cells) తయారీలో ఏదైనా లోపం జరిగి, అవి సరిగ్గా ఏర్పడకపోతే వాటి ఆయుష్షు తగ్గిపోయి, త్వరగా చనిపోతాయి. శరీరంలో రక్తం శాతం తగ్గిపోయి రక్తహీనత ఏర్పడి పలు అనారోగ్య(Health) సమస్యలు ఎదుర్కొంటారు. వాటిలో ఒకటి తలసేమియా(Thalassemia). ప్రపంచంలో నాలుగున్నర శాతం మంది చిన్నారులు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో మూడు కోట్ల యాభై లక్షల మందికి పైగా తలసేమియా బారినపడ్డారు. ప్రపంచ తలసేమియా దినోత్సవం(World Thalassemia Day) సందర్భంగా ఈ వ్యాధికి సంబంధించిన పలు విషయాలు తెలుసుకుందాం..
* కుటుంబంలో ఎవరికైనా తలసేమియా ఉంటే వారికి పుట్టిన పిల్లలకు పరీక్ష చేస్తే ముందే గుర్తించగలం. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారిలో మూడు నెలల నుంచి 18 నెలల వయస్సు మధ్యలో ఈ వ్యాధి బయటపడుతుంది.
* శరీర రంగు పాలిపోయినట్టుగా మారుతుంది. శారీరక ఎదుగుదల ఉండదు. ఎర్రరక్త కణాలు అధికంగా నాశనం అవ్వడం వల్ల, పచ్చ కామెర్లు కలుగవచ్చు. రక్తహీనత వల్ల ఆయాసం, అలసట, నీరసం, శరీరంలో వాపులు రావడం, రోగ నిరోధక శక్తి తక్కువ ఉండడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ పిల్లలు తరచుగా అనారోగ్యాలకు గురవుతుంటారు. ముఖ్యంగా వాంతులు, విరేచనాలు, లేక శ్వాస సంబంధిత సమస్యలు వస్తుంటాయి. వ్యాధి తీవ్రత ఎక్కువగా ఉన్న వారికి శరీరంలో ఎర్రరక్తకణాల సంఖ్యను పెంచడానికి 15 నుంచి 20 రోజులకు ఒక్కసారి రక్తం ఎక్కిస్తారు. ఎముకల మూలుగలో ఉన్న కణాలను మార్పిడి చేసి, బోన్‌మ్యారో ట్రాన్స్‌ప్లాంటేషన్ చేసి రక్తం ఎక్కించే అవసరాన్ని తగ్గించవచ్చు . తీవ్రమైన ఇన్ఫెక్షన్లు కలిగే ప్రమాదం ఎక్కువ కాబట్టి, వీరు తప్పకుండా వ్యాధి నిరోధక టీకాలు తీసుకుంటూ, తరుచూ రోగాల బారిన పడకుండా వ్యక్తిగత పరిశుభ్రత, ఇతర జాగ్రత్తలు తీసుకోవాలి.