Post Meal Walk అంటే ఏంటి? దీని లాభాలేంటి?

Hyderabad: భోజనం చేసిన త‌ర్వాత కాసేపు అటూ ఇటూ న‌డ‌వ‌డాన్నే పోస్ట్ మీల్ వాక్ (post meal walk) అని అంటారు. ఇది ఉద‌యాన్నే లేచి ఎక్సర్‌సైజ్ కోసం చేసే వాకింగ్ లాంటిది కాదు. దీని క‌థ వేరు. అస‌లు దీని వ‌ల్ల లాభాలేంటో చూద్దాం.

*భోజనం చేసిన కాసేప‌టికే ఆ ఫుడ్ బ్రేక్ అయ్యి మ‌న శ‌రీరం దాని నుంచి తీసుకోవాల్సిన విట‌మిన్లు, మిన‌ర‌ల్స్, ప్రొటీన్స్ తీసుకోవ‌డం మొద‌లుపెడుతుంది. ఒక‌వేళ తిన్నాక ఒక ప‌ది నిమిషాలు వాకింగ్ చేస్తే డైజెష‌న్ ప్రాసెస్ సులువు అవుతుంది.

*పోస్ట్ మీల్ వాక్ (post meal walk) చేసిన త‌ర్వాత మ‌న‌లో హ్యాపీ హార్మోన్ విడుద‌ల అవుతుంది. దాని వ‌ల్ల ఏదో తెలీని ఉత్సాహం క‌లుగుతుంద‌ని అంటున్నారు నిపుణులు.

*తిన్నాక ఒక ప‌ది నిమిషాలు వాకింగ్ చేస్తే బ్ల‌డ్‌లో షుగ‌ర్ లెవ‌ల్స్ (blood sugar levels) కంట్రోల్‌లో ఉంటాయ‌ని ఓ రీసెర్చ్‌లో తేలింది.

*బ‌రువు త‌గ్గాల‌నుకునేవారికి తిన్నాక ఒక ప‌ది నిమిషాలు చేసే వాకింగ్ ఎంతో ముఖ్యం. తినేసి అలా కూర్చోవ‌డ‌మో ప‌డుకోవ‌డ‌మో చేస్తే క‌డుపు ద‌గ్గ‌ర విప‌రీతంగా కొవ్వు (cholestrol) పెరిగిపోతుంది.

*పోస్ట్ మీల్ వాక్ (post meal walk) వ‌ల్ల ఒత్తిడి కూడా త‌గ్గుతుంద‌ట‌.

*నిద్ర కూడా బాగా ప‌డుతుంది. ఒక‌వేళ రోజంతా ప‌ని చేసి వ‌చ్చాక తిన్న వెంట‌నే మ‌త్తుగా నిద్ర వ‌స్తుంటుంది. అలాగ‌ని మీరు పోస్ట్ మీల్ వాక్ చేయ‌కుండా ప‌డుకుంటే క‌డుపు బ్లోట్ (bloating) అయిపోతుంది.

*శ‌రీరానికి కావాల్సిన ర‌క్త ప్ర‌స‌ర‌ణ (blood circulation) బాగా జ‌రుగుతుంది