Castor Oil: నాభికి ఆముదం.. లాభాలు అనేకం
Castor Oil: ఆముదాన్ని తలకు రాసుకునే జుట్టు ఒత్తుగా పెరుగుతుందని అందరికీ తెలిసిందే. కాకపోతే ఇది మరీ జిడ్డు ఎక్కువగా ఉంటుంది కాబట్టి చాలా మంది రాసుకోడానికి భయపడుతుంటారు. అలాంటప్పుడు నాభికి రాసుకుంటే ఎన్నో లాభాలు ఉంటాయని చెప్తున్నారు వైద్యులు. నాభిలో రెండు చుక్కల ఆముదం వేసుకుని ఒక 20 సెకెన్లు రుద్దుకుంటే కలిగే లాభాలు అన్నీ ఇన్నీ కావు. ఇది ఇప్పుడిప్పుడు వచ్చిన టెక్నిక్ కాదు. పురాతన రోజుల నుంచి దీనిని అవలంభిస్తున్నారు.
నాభికి ఆముదం రాసుకోవడం వల్ల కలిగే లాభాలేంటో చూద్దాం
*నెలసరి సమయాల్లో విపరీతంగా పొత్తి కడుపులో నొప్పి ఉంటుంది. అలాంటప్పుడు ఊరికే ట్యాబ్లెట్లు వేసుకోకుండా రెండు చుక్కల ఆముదాన్ని బొడ్డు భాగంలో రాసుకుని మర్దన చేసుకుంటే నొప్పులు తగ్గుతాయి.
*కీళ్లవాతం, కండరాల నొప్పులు తగ్గిపోతాయి. పూర్తిగా తగ్గకపోయినా భరించగలిగే నొప్పి ఉంటుంది.
*మలబద్దకం కూడా పోతుంది.
*శరీరానికి నేచురల్ మాయిశ్చరైజర్‌గా పనిచేస్తుంది. శరీరం రబ్బర్‌లా సాగుతుంది. శరీరం నిగనిగలాడేందుకు ఉపయోగ పడే కొలాజిన్ కూడా పెరుగుతుంది.
*కనురెప్పలు, కనుబొమ్మలకు రోజూ రాత్రి వేళల్లో రాసుకుని పడుకుంటే కొన్ని వారాల్లోనే ఒత్తుగా పెరుగుతాయి. కాస్మెటిక్స్‌ని వాడే బదులు ఈ నేచురల్ పద్ధతిని ఫాలో అయితే మంచిది.
*బొడ్డుకు ఈ నూనెతో మర్దన చేస్తే రోగనిరోధక శక్తి కూడా పెరుగుతుంది.
*ఒంట్లోని విషతుల్యాలను బయటికి పంపిచేస్తుంది.
అయితే ఈ ఆముదాన్ని వాడే రీతిలోనే వాడాలి. ప్రయోజనాలు ఉన్నాయి కదా అని ఎక్కువ రోజుల పాటు నాభికి రాసుకుంటే విరోచనాలు అయ్యే ప్రమాదం ఉంది. మరో ముఖ్యమైన విషయం.. మార్కెట్‌లో దొరికే చీప్ ఆముదం కాకుండా గానుగ నుంచి తీసిన నూనెనే వాడాలి. ఒకవేళ మీకు అలెర్జీ ఉంటే కాస్త చేతిపై రాసుకుని 24 గంటల తర్వాత చూసుకోండి. ఒకవేళ మీ చెయ్యి నూనె పూసిన చోట ఎర్రగా మారితే మీకు ఆముదం వల్ల అలెర్జీ కలుగుతుందని అర్థం.