Vitamin D ఎక్కువైతే ప్రాబ్ల‌మా?

Hyderabad: శ‌రీరానికి కావాల్సిన విట‌మిన్ల‌లో D (vitamin D)ఎంతో కీల‌క‌మైన‌ది. అయితే విట‌మిన్లు కావాల్సిన దానికంటే ఎక్కువ మోతాడులో ఉంటే మాత్రం స‌మ‌స్య‌లు త‌ప్ప‌వు. విట‌మిన్ D మీలో ఎక్కువ‌గా ఉన్న‌ట్లైతే.. ఈ స‌మ‌స్య‌లు ఉంటాయి. అవి మీలో ఉన్నాయేమో చూసుకోండి. సాధార‌ణంగా ఒంట్లో విట‌మిన్ లోపం ఉంటే డాక్ట‌ర్లు స‌ప్లిమెంట్లు తీసుకోవాల‌ని చెప్తుంటారు. కొంద‌రైతే డాక్ట‌ర్ల‌ను కూడా సంప్రదించ‌కుండా మార్కెట్‌లో ల‌భించే స‌ప్లిమెంట్లు వేసేసుకుంటూ ఉంటారు. దాని వ‌ల్ల క‌లిగే బెనిఫిట్స్ కంటే ముందు జ‌రిగే చెడు గురించి త‌ప్ప‌కుండా తెలుసుకోవాలి. ముఖ్యంగా విట‌మిన్ D శ‌రీరంలో ఎక్కువ అవుతున్న‌ట్లైతే శ‌రీరమంతా విష‌తుల్యం అయిపోతుంది. హైప‌ర్ విటమినోసిస్ వ‌స్తుంది. ఒకవేళ మీలో ఈ కింది లోక్ష‌ణాలు ఉంటే విట‌మిన్ డి ఎక్కువ‌గా ఉన్న‌ట్లు.

*ఆక‌లి లేక‌పోవ‌డం

*మ‌ల‌బ‌ద్ద‌కం (constipation)

*డీహైడ్రేష‌న్ (dehydration)

*ఎక్కువ‌గా మూత్రానికి వెళ్లాల్సి రావ‌డం

*నీర‌సం (fatigue)

*హై బీపీ (high bp)

*కండ‌రాల బ‌ల‌హీన‌త‌

*వాంతులు అవ‌డం (voitings)