Bitter Guard: కాకరకాయ తింటున్నారా?
Hyderabad: కాకరకాయ (bitter guard) ఒంటికి చేసే మేలు అంతా ఇంతా కాదు. అందుకే వారానికి ఒకసారైనా కాకరకాయ (karela) వంటకం ఏదో ఒకటి చేసుకుని తినాలి అంటారు. కానీ కాకరకాయ బరువు తగ్గడానికి కూడా ఉపయోగపడుతుందని మీకు తెలుసా?
*కాకరకాయలో (bitter guard) కేలొరీలు తక్కువ ఫైబర్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు బాగా తినండి.
*ఎక్కువ ఫైబర్ వల్ల మలబద్ధకం దరిచేరదు. డైజెస్టివ్ సిస్టమ్ మన కంట్రోల్లో ఉంటుంది.
*లివర్ డీటాక్సిఫై చేయడంలో కాకరకాయది పెద్ద పాత్ర. ఇందులో ఉండే ఎన్జైమ్స్ లివర్ బాగా పనిచేయడంలో సహకరిస్తుంది. హ్యాంగోవర్ కూడా వెంటనే తగ్గిపోతుంది.
*గుండె సమస్యలకు కారణమైన LDL కొలెస్ట్రాల్ తగ్గిస్తుంది.
*కాకరకాయలో (bitter guard) యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువ. దీని వల్ల రక్తం శుభ్రపడుతుంది.
*విటమిన్ A మెండుగా ఉంటుంది. ఫలితంగా కంటి సమస్యలు రాకుండా ఉంటాయి.