Onion: తల్లి కూడా చేయని ఉల్లి చేసే మేలేంటి?
Hyderabad: ఉల్లి చేసే మేలు తల్లి కూడా చేయదని పెద్దలు ఊరికే అన్నారా.. ఉల్లిపాయలో (onion) ఉన్న లాభాలు అలాంటివి మరి. అసలు ఉల్లి (onion) మనకు ఏ విధంగా మేలు చేస్తుందో చూద్దాం.
*ఉల్లిపాయ (onion) గుండెతో ఎంతో మంచిది. ఉల్లిలో ఉండే ఫ్లేవనాయిడ్స్ చెడు కొలెస్ట్రాల్‌ని (LDL) తగ్గించేస్తుంది.
*ఉల్లిలో ఉండే క్వర్సెటిన్ అనే యాంటీ ఆక్సిడెంట్ ఫ్లేవనాయిడ్ కీళ్లనొప్పులు రాకుండా చేస్తుంది.
*కళ్లకు ఎంతో మేలు. ఉల్లిలో ఉండే సెలీనియం అనే ఎంజైమ్ విటమిన్ Eని ప్రొడ్యూస్ చేస్తుంది. ఫలితంగా కళ్ల సమస్యలు రాకుండా ఉంటాయి.
*యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ మైక్రోబియల్ ప్రాపర్టీస్ ఉల్లిలో ఎక్కువగా ఉంటాయి కాబట్టి నోటి సంరక్షణకు కూడా మంచిది. పచ్చి ఉల్లిపాయ తింటే నోట్లో హాని కలిగించే బ్యాక్టీరియా నశిస్తుంది.
*ఉల్లిలో (onion) విటమిన్ C కూడా ఉంటుంది. ఫలితంగా చర్మ ఆరోగ్యానికి ఎంతో మంచిది.
*ఉల్లి రసంలో సల్ఫర్ ఉంటుంది. ఇది జుట్టుకి ఎంతో మేలు చేస్తుంది. వాసన వస్తుందని దూరం పెట్టకండి. మంచి షాంపూతో క్లీన్ చేసుకుంటే సరిపోతుంది.
*ఈజీ డైజెషన్‌లోనూ ఉల్లి ఎంతో హెల్ప్ చేస్తుంది. అందుకే రెస్టారెంట్లలో ఫుడ్ ఆర్డర్ చేయగానే ముందుగా ఆనియన్, లెమన్ సలాడ్ తెచ్చి పెడుతుంటారు.