ఇవి ఆల్క‌హాల్ కంటే డేంజ‌ర్..!

Hyderabad: లివ‌ర్ ( healthy liver) బాగుండాలంటే తాగుడుకి (alcohol) దూరంగా ఉండాలి అంటుంటారు. కానీ కొన్ని ర‌కాల ఆహార ప‌దార్థాల‌కు (foods) కూడా దూరంగా ఉండాలి. ఇవి ఆల్క‌హాల్ కంటే డేంజ‌రస్ అట‌. అవేంటో చూద్దాం.

అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్
వీటికి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. రెస్టారెంట్లు, ఫాస్ట్ ఫుడ్ సెంట‌ర్ల‌లో దొరికేవ‌న్నీ అల్ట్రా ప్రాసెస్డే.

షుగ‌ర్ డ్రింక్స్
కూల్ డ్రింక్స్‌, సోడా, కుకీ, ఫ్రూట్ జ్యూసుల్లో షుగ‌ర్ కంటెంట్ ఎక్కువ‌గా ఉంటుంది. అంత‌గా ఫ్రూట్ జ్యూస్ తాగాల‌ని ఉంటే మీరే ఇంట్లో చేసుకుని తాగండి.

రిఫైన్డ్ కార్బ్స్ 
పాస్తా, వైట్ బ్రెడ్ లాంటివి ఒంట్లో బ్ల‌డ్ షుగ‌ర్ అమాంతం పెరిగిపోయేలా చేస్తాయి. నెల‌లో ఒక‌సారి అయితే తిన‌చ్చు కానీ వారానికి ఒక‌సారి కూడా వీటి జోలికి పోకండి.

ఫ్రైడ్ ఫుడ్స్
ఫ్రెంచ్ ఫ్రైస్ లాంటి ఫ్రైడ్ ఫుడ్స్‌లో విప‌రీత‌మైన కేలొరీలు ఉంటాయి. వీటిని చూస్తే నూరూరుతుంటుంది. అయినా కంట్రోల్ లో ఉండ‌టం బెట‌ర్. లేదంటే ఫ‌స్ట్ ఎఫెస్ట్ అయ్యేది లివ‌రే.

ప్రాసెస్డ్ మీట్
ప్రాసెస్డ్ మీట్‌లో సాచురేటెడ్ ఫ్యాట్ ఉంటుంది. ఇది ఒంటికి అస్స‌లు మంచిది కాదు. దీనిని తినడం వ‌ల్ల సీరియ‌స్ లివ‌ర్ స‌మ‌స్య‌లు వ‌స్తాయి.

ఇన్‌స్టంట్ నూడుల్స్
సూప‌ర్ మార్కెట్‌లో ఇన్‌స్టంట్ నూడుల్స్ అని అమ్ముతుంటారు. ఇందులో మోనోసోడియం గ్లూట‌మేట్ అనే విష‌పూరితమైన ప‌దార్థం ఉంటుంది. ఇది న‌రాల‌కు చాలా డేంజ‌ర్. అంతేకాదు పిల్ల‌ల్ని క‌న‌లేని ప‌రిస్థితిని తెస్తుంద‌ట‌..