Womens health: ఈ 5 విటమిన్లు అందుతున్నాయా?
Hyderabad: మహిళలు (women’s health) తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఈ ఐదు విటమిన్లు(vitamins) తప్పనిసరి అని చెబుతున్నారు పోషకాహార నిపుణులు. వీటిలో ఏ ఒక్కటి లోపించినా అనారోగ్య సమస్యలు(health issues) తప్పవని హెచ్చరిస్తున్నారు. 30 ఏళ్ల వరకు ఏం తిన్నా శరీరం సహకరిస్తుంది. 30 తర్వాత విటమిన్ల లోపం కారణంగా ఎన్నో మార్పులు వస్తాయి. ఇంతకీ పోషకాహార నిపుణులు చెబుతున్న ఆ ఐదు విటమిన్లు ఏంటో చూడండి.
ఐరన్: శరీరంలో ఆక్సిజన్‌ను ఇతర అవయవాలకు ట్రాన్స్‌పోర్ట్ చేయడంలో ఐరన్ (Iron)ది కీలక పాత్ర. మహిళలకు పీరియడ్స్(periods) సమయంలో రక్తం ఎక్కువ పోతుంటుంది కాబట్టి ఐరన్ లోపం తలెత్తే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి ఐరన్ పుష్కలంగా ఉండే ఆకుకూరలు, ఓట్స్, డ్రైఫ్రూట్స్ క్రమం తప్పకుండా తినాలి.
కాల్షియం: మహిళలకు ఎముకపుష్ఠి పురుషులతో పోలిస్తే తక్కువగా ఉంటుంది. తగినంత కాల్షియం ఎముకలకు అందడం అవసరం. కానీ ఎక్కువ మొత్తంలో కాల్షియం సప్లిమెంట్లు తీసుకున్నా అనర్థమేనని గ్రహించాలి.
విటమిన్ B12: రక్తకణాలు, DNA, నరాల పనితీరును మెరుగుపరిచే శక్తి విటమిన్ B12కి ఉంది. B 12 లోపిస్తే ఎనీమియా వస్తుంది. ఎనీమియా బారినపడితే కోలుకోవడం కష్టం. కాబట్టి B12 పుష్కలంగా దొరికే చేపలు, గుడ్లు, తృణధాన్యాలు తీసుకోండి.
బయోటిన్: బయోటిన్ విటమిన్ కేవలం జుట్టుకే అనుకుంటారు. కానీ లివర్, నరాలు, కళ్లు, చర్మం, గోళ్లకు కూడా ఇది చాలా అవసరం. మార్కెట్‌లో దొరికే బయోటిన్ గమ్మీలు కాకుండా నేచురల్‌గా పొద్దుతిరుగుడు విత్తనాలు, చేపలు, గుడ్ల నుంచి పొందండి.
విటమిన్ D: సూర్యుడి కిరణాల్లో సహజంగా లభించే విటమిన్ D ఎంతో మంచిది. కానీ అమ్మాయిలు, మహిళలు సన్‌స్క్రీన్లు రాసేసి ఆ విటమిన్ డిని నేచురల్‌గా అందకుండా చేసుకుంటున్నారు. ఇది కాల్షియం లోపానికి దారితీస్తుంది. మరీ ఎండ ఎక్కువగా ఉన్నప్పుడు కాకుండా ఉదయాన్నే సూర్యుడి కిరణాలు శరీరంపై పడేలా చూసుకోండి.