Monsoon Food: వర్షాకాలంలో ఇవి తినకూడదా?
Hyderabad: ఏ కాలానికి తగ్గట్టు ఆహార పదార్థాలు ఆ కాలంలోనే తినాలని అంటున్నారు ఎక్స్‌పర్ట్స్. ఇప్పుడు వర్షాకాలం (monsoon food) కాబట్టి ఈ సమయంలో కొన్ని రకాల ఆహార పదార్థాలకు దూరంగా ఉంటే మంచిది అంటున్నారు. ఇంతకీ అవేంటో తెలుసుకుందాం.
ఆకుకూరలు (green leafy vegetables)
కొన్ని రకాల ఆకుకూరలను వర్షాకాలంలో తినకపోవడమే మంచిదట. ముఖ్యంగా క్యాబేజీ, పాలకూర వంటి జాగ్రత్తగా చూసి తినాలట. ఎందుకంటే వర్షాకాలంలో గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆకుకూరల్లో నీటి శాతం కూడా ఎక్కువగా ఉంటుందట. దాంతో అవి వెంటనే కుళ్లిపోతుంటాయి. అవి కుళ్లకపోయినా బ్యాక్టీరియా సులువుగా వచ్చి చేరుతుందట.
మొకలెత్తే కూరగాయలు (cruciferous veggies)
కాలిఫ్లవర్, బ్రొకోలీ వంటివి కాడల దగ్గర మొలకలెత్తుతున్నట్లు ఉంటాయి. వర్షాకాలంలో ఈ కూరగాయల్లో బ్యాక్టీరియా త్వరగా పట్టేస్తుందట. పైగా వర్షపు నీటిలో నాని తర్వాత వాటిని కొని ఎంత కడిగినా వేస్టే అని అంటున్నారు నిపుణులు.
రూట్ వెజిటబుల్స్ (root vegetables)
క్యారెట్, ముల్లంగి, ఉల్లి కాడలు.. ఇవి వేర్లతో సహా నేల నుంచి పీకాలి. వర్షాకాలంలో నేలలో నీరు ఎక్కువగా ఇంకుతుంది కాబట్టి ఈ కూరగాయలు ఎక్కువ నీటిశాతాన్ని పీల్చుకుంటాయట. దాంతో వెంటనే పాడైపోయే ఛాన్సులు ఎక్కువ. సరిగ్గా నిల్వ చేసే పద్ధతిలో నిల్వ చేస్తేనే అవి తినడానికి ఉపయోగపడతాయి.
ఇవే కాకుండా పుట్టగొడుగులు, మొలకలు వంటివి కూడా చూసుకుని తినడం బెటర్. వర్షాకాలంలో వీటిని మార్కెట్‌లో సరిగ్గా నిల్వ చేయలేకపోతారు. అందుకే అప్పటికప్పుడు ఫ్రెష్‌గా దొరికేవి కొనుక్కుని అదే రోజు వండుకోవడం బెటర్.