Facials: వింత ఫేషియల్స్…బెస్ట్ రిజల్ట్స్!
Hyderabad: వివిధ రకాల క్రీములతో ఫేషియల్స్ (facials) చేయించుకోవడం గురించి వినే ఉంటారు. కానీ నత్తలు, పాములు, పక్షుల మలవిసర్జనలతో చేసే ఫేషియల్స్ (facials) గురించి విన్నారా? వినడానికి వింతగానే ఉన్నా.. దాని నుంచి వచ్చే రిజల్ట్స్ మాత్రం అద్భుతంగా ఉంటాయని అంటున్నారు బ్యుటిషియన్లు.
నో పెయిన్ నో గెయిన్ అంటుంటారు. అది ఫేషియల్స్‌కి కూడా వర్తిస్తుంది ఈ వింత ఫేషియల్స్‌ని చూస్తుంటే నిజమే అనిపిస్తోంది. ముఖం అందంగా మారడానికి మీరు మీ ముఖంపై పాముని ఎక్కించుకుంటారా? వింటుంటేనే వణుకు పుడుతోంది కదా. కానీ కొందరు అమ్మాయిలు అందమే ముఖ్యం ఏమైనా చేస్తాం అని ఈ స్నేక్ ఫేషియల్ చేయించుకుంటున్నారట.
ఇక నత్తలతో చేసే ఫేషియల్ గురించి తెలిసిందే. ఎప్పటినుంచో ఇది కొరియన్ స్కిన్ కేర్‌లో భాగంగా ఉంది. నత్తల నుంచి తీసిన సీరమ్‌లు కూడా ఇప్పుడు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నాయి. ఈ నత్త ఫేషియల్ వల్ల ముడతలు, మచ్చలు అన్నీ పూర్తిగా తగ్గిపోతాయి.
ఇక నైటింగేల్ ఫేషియల్ అని ఒకటి ఉంది. నైటింగేల్ పక్షి నుంచి వచ్చిన మలవిసర్జనతో ఈ ఫేషియల్ చేస్తారు. వికారంగా అనిపించినప్పటికీ ఫేషియల్ చేసిన తర్వాత వస్తున్న రిజల్ట్స్ చూసి అమ్మాయిలు ఎగబడుతున్నారట.
స్లాప్ ఫేషియల్.. ఇది మరో వింత. చెంప ఛెళ్లుమనేలా కొడుతూ ఈ ఫేషియల్ చేస్తారు. ఈ ఫేషియల్ చేయించుకునేటప్పుడు 50 సార్లు చెంపలపై కొట్టించుకుంటారు. దీని వల్ల రక్తప్రసరణ బాగా జరుగుతుందట.