మీరు ఫ‌స్ట్ ఛాయిస్ కాద‌ని ఎలా తెలుసుకోవాలి?

Relationship: ఏ అమ్మాయికైనా అబ్బాయికైనా తన పార్ట్‌న‌ర్‌కి తానే ఫ‌స్ట్ ఛాయిస్ కావాల‌ని కోరుకుంటారు (relationship). వారికి ఆల్రెడీ గ‌తంలో ల‌వ్ ఎఫైర్స్ ఉన్న‌ప్ప‌టికీ ప్ర‌స్తుతానికి మ‌న‌తో ఎలా ఉన్నారు అనేదే ఇంపార్టెంట్ అనుకుంటారు. అయితే కొంద‌రు మాత్రం ఒక‌రిని ల‌వ్ చేస్తున్న‌ట్లు న‌టిస్తూ వారిని సెకండ్ ఆప్ష‌న్‌గా పెట్టుకోవాల‌ని చూస్తుంటారు. ఇలాంటి వారితో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. మిమ్మ‌ల్ని మీ పార్ట్‌న‌ర్ ఫ‌స్ట్ ఛాయిస్‌గా చూస్తున్నారో లేదో తెలుసుకోవాలంటే కొన్ని టిప్స్ ఉన్నాయి. వాటి ద్వారా మిమ్మ‌ల్ని మీరు సేవ్ చేసుకోవ‌చ్చు.

ప్ర‌వ‌ర్త‌నలో మార్పులు

మీ పార్ట్‌న‌ర్‌కి మీరు ఫ‌స్ట్ ఛాయిస్ కాక‌పోతే వారు మీతో ప్ర‌వ‌ర్తించే తీరులో మార్పులు ఉంటాయి. ఒక‌సారి ఎంతో ప్రేమ‌గా ఇంకోసారి అస‌లు మీరు ఎవ‌రో తెలీన‌ట్లుగా బిహేవ్ చేస్తుంటారు. ఇది మొద‌టి రెడ్ ఫ్లాగ్ అని గుర్తుంచుకోండి.

సోఫ‌ల్ లైఫ్‌

వారు త‌మ ఫ్రెండ్స్‌ని కానీ సోష‌ల్ లైఫ్‌ని కానీ మీతో షేర్ చేసుకోవాల‌ని అనుకోరు. ఎక్క‌డ ఫ్రెండ్స్‌ని పరిచ‌యం చేస్తే మీరు వారి ద్వారా అన్ని సీక్రెట్స్ రాబ‌డ‌తారోన‌న్న భ‌యంవారిలో ఉంటుంది. మీరు ఎప్పుడైనా మీ పార్ట్‌న‌ర్‌ని త‌న ఫ్రెండ్స్ గురించి అడిగి చూసారా? ప‌రిచ‌యం చేస్తే ఓకే. ఒక‌వేళ ప‌రిచ‌యం చేయ‌కుండా అస‌లు త‌న‌కు ఫ్రెండ్సే లేరు అని చెప్తుంటే మాత్రం ఆలోచించాల్సిన విష‌య‌మే. (relationship)

మీతో ఉన్న స‌మ‌యాన్ని ఆస్వాదించ‌రు

ప్రేమ‌లో ఉన్న‌వారికి కొన్ని గంట‌ల పాటు త‌మ పార్ట్‌న‌ర్‌తో గ‌డ‌పాల‌ని అనిపిస్తుంది. వారితో ఉన్న ప్ర‌తిక్ష‌ణాన్ని ఆస్వాదిస్తుంటారు. ఒక‌వేళ మీ పార్ట్‌న‌ర్ మీతో ఉన్నా కూడా వేరే ధ్యాస‌లో ఉండ‌టం, మీ ప‌క్క‌న కూర్చుని ఫోన్లు చూసుకుంటూ ఉండ‌టం వంటివి చేస్తుంటే జాగ్ర‌త్త‌ప‌డండి.

భ‌విష్య‌త్తు ప్ర‌ణాళిక‌లు

నిజాయ‌తీగా ప్రేమ‌లో ఉన్న‌వారు మీతో పెళ్లి గురించి భ‌విష్య‌త్తు గురించి ప్లాన్లు వేస్తుంటారు. ఒక‌వేళ మీరు పెళ్లి గురించి మాట్లాడుతున్నా మీ పార్ట్‌న‌ర్ స్పందించ‌క‌పోవ‌డం, అస‌లు ఆ టాపిక్ గురించి కూడా మాట్లాడ‌క‌పోవ‌డం వంటివి చేస్తుంటే వెంట‌నే ఆ బంధాన్ని అక్క‌డితో ఆపేయడం బెట‌ర్. ఆలోచించి చూడండి.

ఇత‌రుల‌తో ఫ్ల‌ర్ట్ చేయడం

మీతో మీ పార్ట్‌న‌ర్ ఎలా ఉంటున్నారో ఇతరుల‌తో కూడా అలాగే ఉంటున్నారు అంటే క‌చ్చితంగా మీరు మోస‌పోతున్న‌ట్లే. ప్రేమించిన అమ్మాయి లేదా అబ్బాయితో ఎలా ప్ర‌వ‌ర్తిస్తామో అలాగే ఇత‌రుల‌తో ప్ర‌వ‌ర్తిస్తూ క‌మాన్ యార్ ఇది ఇప్పుడు కామ‌న్ అంటుంటే మాత్రం ముఖం మీదే నో చెప్పేయండి. ఈరోజు కామ‌న్ అంటూనే రేపు పెళ్ల‌య్యాక కూడా వేరొక‌రితో ఉండ‌టం కూడా కామ‌న్ అంటారు ఇలాంటి వాళ్లు. (relationship)

కాల్స్ లిఫ్ట్ చేస్తున్నారా?

ఈ విష‌యం చాలా ముఖ్యం. మీ పార్ట్‌న‌ర్ త‌న ఫ్రెండ్స్‌తో బ‌య‌టికి వెళ్లారు అనుకోండి.. అప్పుడు మీరు కాల్ చేస్తే లిఫ్ట్ చేస్తున్నారా? లిఫ్ట్ చేయ‌కుండా ఒక గంట అర‌గంట ఆగి మ‌ళ్లీ కాల్ బ్యాక్ చేసి సారీ.. ఫోన్ సైలెంట్‌లో ఉంది అని చెప్తున్నారా? ఇలాంటివారితో చాలా అంటే చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. ఒక బంధం నిల‌బ‌డాలంటే కావాల్సింది న‌మ్మ‌కం ఒక్క‌టే కాదు పార‌ద‌ర్శ‌క‌త కూడా. అంటే ట్రాన్స్‌ప‌రెన్సీ. వారి స్పేస్ వారికి ఇద్దాం.. వారి ప‌ర్స‌న‌ల్ ప్రైవ‌సీ వారికి ఇద్దాం అనుకుంటే ఈ రోజుల్లో అస్స‌లు కుద‌ర‌ని ప‌ని. కాబ‌ట్టి త‌ర్వాత మోస‌పోయామే అని బాధ‌ప‌డేకంటే.. ఇప్ప‌టినుంచే జాగ్ర‌త్త‌ప‌డ‌టం బెట‌ర్ క‌దా..!