Health: భోజనమయ్యాక నెయ్యి, బెల్లం తినాలా?
భోజనం చేసాక బెల్లం (jaggery), నెయ్యి (ghee) కలుపుకుని తినాలట. ఇలా చేస్తే మన శరీరంలో దోషాలపై ప్రభావం చూపి హార్మోనల్ ఇంబాలెన్స్ కాకుండా ఉంటుందని ఆయుర్వేదం చెప్తోంది. (health)
అసలు నెయ్యి, బెల్లం ఎందుకు తినాలి?
భోజనం అయ్యాక ఒక ముక్క బెల్లం ఒక స్పూన్ నెయ్యి తింటే రోగనిరోధక శక్తి (immunity) పెరుగుతుంది. అంతేకాదు మెటబాలిజం (metabolsim) పెరిగి మలబద్ధకం కూడా పోతుంది. నెయ్యితో ఆరోగ్యకరమైన కొవ్వు (healthy fat) ఉంటుంది. అంతేకాదు ఇది చెక్కర చేసే హాని చేయదు. విటమిన్స్, మినరల్స్ కూడా పుష్కలంగా ఉంటాయి. బెల్లంలో సుక్రోస్ (sucrose) అనే నేచురల్ షుగర్ ఉంటుంది. ఇది వెంటనే ఎనర్జీని కలిగిస్తుంది. నెయ్యిలో ఆరోగ్యకరమైన కొవ్వు ఉంటుంది కాబట్టి బ్లడ్ షుగర్ (blood sugar) వెంటనే పెరిగే ప్రమాదం ఉండదు. ఎందుకంటే నెమ్మదిగా అరుగుతుంది కాబట్టి.
ఐరన్ లోపం ఉండదు
బెల్లంలో పుష్కలంగా లభించే విటమిన్ ఐరన్ (iron). దీనిని నెయ్యితో కలిపి తింటే శరీరం ఐరన్‌ను గ్రహించుకోగలుగుతుంది. ప్రముఖ పోషకాహార నిపుణురాలు రుజుతా దివాకర్ (rujuta diwekar) తెలిపిన వివరాల ప్రకారం హార్మోన్స్ అసమతుల్యతను (harmonal imbalance) తగ్గించడంలో నెయ్యి, బెల్లాన్ని మించిన ఆహారం లేదట. కాకపోతే టేస్ట్ బాగుంది కదా అని మరీ ఎక్కువగా తినేస్తే కేలొరీలు ఎక్కువైపోతాయి. (health)