Curd: రాత్రి తిన‌చ్చా లేదా?

Hyderabad: పెరుగు(curd) రాత్రి పూట తినచ్చా లేదా అనే సందేహం చాలా మందికి ఉంటుంది. అస‌లు ఎప్పుడు తింటే మంచిది? ఏ కాంబినేష‌న్‌తో తింటే మంచిదో తెలుసుకుందాం.

పెరుగును రాత్రి పూట తినడం వ‌ల్ల ఎలాంటి హాని జ‌ర‌గ‌దని కాక‌పోతే త‌క్కువ మోతాదులో తీసుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పెరుగు అనేది పాల ప‌దార్థం. అందులో ప్రొటీన్, ఫ్యాట్ ఎక్కువ‌గా ఉంటుంది. రాత్రి పూట ప్రొటీన్, ఫ్యాట్ త‌క్కువ‌గా ఉన్న ఆహారం తీసుకుంటే మంచిది. వాటి లోడ్ ఎక్కువుంటే రాత్రిపూట కొంద‌రికి స‌రిగ్గా అర‌గ‌దు. ఆల్రెడీ కాన్‌స్టిపేష‌న్, డైజెష‌న్ స‌మ‌స్య‌లు ఉన్న‌వారు అస‌లు తీసుకోక‌పోవ‌డ‌మే మంచిది అని స‌ల‌హా ఇస్తున్నారు. పెరుగు ఒక్కోసారి పుల్ల‌గా, ఒక్కోసారి తియ్య‌గా ఉంటుంది. ఇది శ‌రీరంలో క‌ఫ దోషం పెంచుతుంది. ఈ క‌ఫ దోషం అనేది పెరిగితే లంగ్స్‌లో క‌ఫం పేరుకుపోతుంది. అయితే ఇది అంద‌రికీ వ‌ర్తించ‌దు. ఆస్త‌మా, ద‌గ్గుతో బాధ‌ప‌డేవారు రాత్రి పూట పెరుగు తిన‌కూడ‌ద‌ని వైద్యులు చెప్తున్నమాట‌. పెరుగులో బి 12, రైబోఫ్లేవిన్ విట‌మిన్లు ఉంటాయి. ఇవి చ‌ర్మాన్ని, జుట్టుని నిగ‌నిగ‌లాడేలా చేస్తాయి. పెరుగులో కూలింగ్ ప్రాప‌ర్టీస్ ఎక్కువ‌గా ఉంటాయి కాబ‌ట్టి స‌మ్మర్‌లోనే తిన‌డం బెట‌ర్.