Kidneys: కిడ్నీలను కాపాడుకోండిలా!

Hyderabad: మానవ శరీరంలోని ముఖ్యమైన అవయవాల్లో కిడ్నీలు(Kidneys) కూడా ఒకటి. రక్తం నుండి వ్యర్థాలను వేరుచేయడమే వీటి పని. వీటి పనితీరు సక్రమంగా ఉంటే శరీరానికి కావలసినంత శుభ్రమైన రక్తం అందుతుంది. లేదంటే.. రకరకాల అనారోగ్య సమస్యలు తలెత్తుతాయి. కాబ‌ట్టి కిడ్నీల‌ను ఈ జాగ్ర‌త్త‌ల‌తో కాపాడుకోండి.

* క్రమం తప్పకుండా వ్యాయామం చేస్తే వెన్నెముక స్ట్రాంగ్‌గా మారి దీర్ఘకాలిక కిడ్నీ వ్యాధిని అభివృద్ధి చేసే అవకాశాన్ని తగ్గిస్తుంది.

* రక్తంలో అధిక చక్కెర స్థాయిలు కిడ్నీలలోని చిన్న రక్తనాళాలను దెబ్బతీస్తాయి. ఆహార నియమాలను పాటిస్తూ మధుమేహాన్ని నియంత్రించడం తప్పనిసరి.

* హెల్తీగా ఉన్న‌వారూ పలు యాంటీ బయాటిక్స్​, పెయిన్​ కిల్లర్స్​ను వాడటం వల్ల కిడ్నీలు దెబ్బతినే అవకాశం ఉంది.

* రోజూవారి ఆహారంలో అదనపు కొవ్వు, ఉప్పు, చక్కెర వంటివి ఎక్కువ మోతాదులో లేకుండా జాగ్రత్తపడాలి. వీటివల్ల అధిక రక్తపోటు, ఊబకాయం, మధుమేహం, కిడ్నీల సంబంధ వ్యాధులు వచ్చే అవకాశం ఎక్కువ. ప్రాసెస్డ్ ఫుడ్​కి దూరంగా ఉండాలి.

* శరీరానికి సరిపడా నీరు అందనప్పుడు కిడ్నీలోని చిన్న చిన్న ఫిల్టర్‌లు మూసుకుపోయి రాళ్లు ఏర్పడి ఇన్‌ఫెక్షన్లకు దారి తీయవచ్చు.

*ధూమపానం, మ‌ధ్య‌పానం కిడ్నీ క్యాన్సర్​కు కారణమవుతుంది. 60 ఏళ్లు పైబడినవారు, కుటుంబంలో కిడ్నీ సంబంధిత సమస్యలతో బాధపడేవాళ్లు ఉన్నవారు తరచూ రక్తపరీక్షలు, మూత్ర పరీక్షలు చేయించుకుంటూ పనితీరును తెలుసుకోవాలి. ​