Eye Infection: వర్షాకాలంలో జాగ్రత్త..!
Hyderabad: వర్షాకాలం కావడంతో దేశవ్యాప్తంగా కళ్ల ఇన్‌ఫెక్షన్ (eye infection) కేసులు ఎక్కువ అవుతున్నాయి. దీనిని కంజక్టివిటిస్ (conjuctivitis) అంటారు. అంటే కళ్ల కలక. వర్షాకాలం కావడంతో ఈ కేసులు దిల్లీలో విపరీతంగా పెరిగిపోతున్నాయట. ఈ ఇన్‌ఫెక్షన్ నుంచి కళ్లను ఎలా కాపాడుకోవాలో తెలుసుకుందాం.
క్యారెట్లు (carrots)
కళ్లకు క్యారెట్లు ఎంతో మంచివి అన్న విషయం అందరికీ తెలిసిందే. అసలే కళ్ల ఇన్‌ఫెక్షన్లు ఎక్కువ అవుతున్న సీజన్ కాబట్టి వీటిని ఎక్కువగా తీసుకోవడానికి ప్రయత్నించండి. కాకపోతే పచ్చివి తినకుండా ఒక ఐదు నిమిషాల పాటు ఉడకబెట్టుకుని తినండి. లేదా జ్యూస్ చేసుకుని తాగేయండి.
బాదం (almonds)
బాదం పప్పులు కళ్లకు విటమిన్ ఈ అందేలా చేస్తాయి. ఫలితంగా ఇన్‌ఫెక్షన్ సోకడానికి ఛాన్సులు తక్కువ. ఒకవేళ సోకినా త్వరగా తగ్గిపోతుంది. (eye infection)
పాలు, పెరుగు (milk, curd)
పాలు, పెరుగును క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల కూడా కళ్లకు ఎంతో మేలు. వీటిలో జింక్, విటమిన్ ఏ అధికంగా ఉంటాయి. రెండూ కళ్లకు మేలు చేసేవే. విటమిన్ ఏను జింక్ లివర్ నుంచి కళ్లకు అందేలా చేస్తుంది.
నారింజ (orange)
సిట్రస్ జాతికి చెందిన నారింజలో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. కళ్లకు చాలా మంచిది.
గుడ్లు (eggs)
కాలంతో పనిలేకుండా రోజుకో గుడ్డు తీసుకోండి. పచ్చ సొనల్లో ఉండే అన్ని పోషకాలు కళ్లకు మేలు చేసేవే. (eye infection)
చేపలు (fish)
చేపలు తినే అలవాటు ఉంటే సాల్మన్ చేపను ఈ వర్షాకాలంలో ఎక్కువగా తినేలా చూసుకోండి. ఇందులో ఉండే ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కంటి చూపును మెరుగుపరచడంలో సాయపడుతుంది.