Panipuri: పానీపూరీలో బయటపడిన క్యాన్సర్ కారకాలు
Panipuri: భయ్యా తోడా ప్యాజ్ డాలో అంటూ పానీపూరీని ఇష్టంగా తెగ లాగించేస్తుంటారు. వాతావరణంతో సంబంధంలేకుండా అందరూ ఇష్టంగా తినే చిరుతిండి ఈ పానీపూరీ. అయితే.. పానీపూరీ సాంపుల్స్ కలెక్ట్ చేసి పరీక్షలు నిర్వహించగా అందులో క్యాన్సర్ కారకాలు ఉన్నట్లు బయటపడ్డాయి. ఈ ఘటన కర్ణాటకలో చోటుచేసుకుంది. కర్ణాటకకు చెందిన పలువురు ఫుడ్ సేఫ్టీ అధికారులు పలు ప్రదేశాల నుంచి దాదాపు 15 పానీపూరీ సాంపుల్స్ కలెక్ట్ చేసారు. వాటిని పరీక్షలకు పంపగా అందులో వాడుతున్న ఆర్టిఫిషియల్ రంగుల్లో క్యాన్సర్ కారకాలు ఉంటున్నాయని తేలింది. ఈ విషయాన్ని అధికారులు వెల్లడించారు. పానీపూరీని ఇష్టంగా తినేవాళ్లు అదేదో ఇంట్లోనే చేసుకుని తింటే మంచిదని హెచ్చరిస్తున్నారు.