Health: చెక్కర కంటే బెల్లం, తేనె మంచివి కావు.. న్యూట్రిషనిస్ట్ షాకింగ్ వెల్లడి
Health: చాలా మంది తెల్ల చెక్కరకు బదులు బెల్లం కానీ తేనె కానీ వాడుతుంటారు. చెక్కరతో పోలిస్తే ఆ రెండూ బెటర్ అనుకుంటారు. అయితే అందులో ఏమాత్రం వాస్తవం లేదని ప్రముఖ న్యూట్రిషనిస్ట్ సోనాక్షి జోషి అంటున్నారు. ఎలాంటి చెక్కరైనా శరీరంలోకి వెళ్లాక గ్లూకోజ్‌గా మారాల్సిందేనని.. దానికి చెక్కర, బెల్లం, తేనె అనే విభేదాలు ఏమీ లేవని అంటున్నారు. అయితే.. రిఫైన్డ్ షుగర్‌తో పోలిస్తే దానికి ప్రత్యామ్నాయాల్లో గ్లైసెమిక్ ఇండెక్స్ శాతం కాస్త అటు ఇటుగా ఉంటుందట. ఆ మాత్రం దానికి తెల్ల చెక్కర తింటే ఇన్సులిన్ అమాంతం పెరిగిపోతుందని.. బెల్లం, తేనె తింటే అసలు ఇన్సులిన్‌ని తగ్గించడాలు వంటివి చేస్తుందనడంలో ఏమాత్రం నిజం లేదని జోషి అంటున్నారు.
అయితే చెక్కర, బెల్లం, తేనె ఇలా ఏ తీపి పదార్థాన్ని తీసుకున్నా మితంగా తింటే ఏదీ ప్రమాదం కాదు అని చెప్తున్నారు. వీటన్నింటికి బదులు ఖర్జూరాలను తింటే మంచిదని.. కాకపోతే అందులో పీచు పదార్థం, కేలొరీలు ఎక్కువగా ఉంటాయని కాబట్టి ఎక్కువ తింటే బరువు పెరుగుతారని తెలిపారు. ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో ఈ పోస్ట్ పెట్టడంతో కామెంట్ సెక్షన్‌లో పెద్ద డిబేట్ నడుస్తోంది.