Sugar: ఉప్పు, చెక్కరలో మైక్రో ప్లాస్టిక్స్.. !
Sugar: మనం రోజూ తినే ఉప్పు, చెక్కరలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నట్లు ఓ పరిశోధనలో వెల్లడైంది. భారతదేశంలో అమ్మే దాదాపు అన్ని చెక్కర, ఉప్పులలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. టాక్సిక్స్ లింక్ అనే సంస్థ అధినేత రవి అగర్వాల్ దాదాపు 10 టాప్ బ్రాండ్లకు చెందిన చెక్కర, ఉప్పులపై పరిశోధనలు చేసారు. వీటన్నింటిలో ఏదో ఒక రూపంలో మైక్రో ప్లాస్టిక్స్ ఉన్నాయట. ఈ మైక్రో ప్లాస్టిక్ సైజు 0.1 మిల్లీ మీటర్ నుంచి 5 మిల్లీ మీటర్ మధ్యలో ఉన్నట్లు తెలిసింది. ముఖ్యంగా అయోడైజ్డ్ సాల్ట్ అని ఏవైతే మార్కెట్లలో అమ్ముతున్నారో వాటిలో ఈ మైక్రో ప్లాస్టిక్స్ వాడకం ఎక్కువగా ఉందట.
ఈ మైక్రో ప్లాస్టిక్స్ మనం పీల్చే గాలి నుంచి తీసుకునే ఆహారం వరకు ఎందులోనైనా ఉండచ్చు. ఇవి శరీరంలోని ఊపితిత్తులు, గుండెతో పాటు కడుపులోని శిశువు శరీరంలో కూడా చేరతాయట. మన భారతదేశంలో సగటున రోజూ ఒక మనిషి వాడాల్సిన చెక్కర, ఉప్పు కంటే ఎక్కువే వాడుతుంటాం. అంటే ఎంత ఎక్కువ వాడితే అంత ఎక్కువ మైక్రో ప్లాస్టిక్స్ని కూడా తీసుకుంటున్నట్లే. దీని వల్ల అనేక అనారోగ్య సమస్యలు వస్తాయని హెచ్చరిస్తున్నారు. కానీ ఇప్పుడు చేయగలిగింది ఏమీ లేదు. ఎందుకంటే బయట మార్కెట్లలో ఆర్గానిక్ అని అమ్ముతున్న వాటిల్లో కూడా స్వచ్ఛదనం లేదు. మనకే సొంతంగా పొలాలు ఉంటే తప్ప స్వచ్ఛమైనవి పండించుకోలేం. అలాగని వాటిని మార్కెట్ నుంచి కొని తినకుండా ఉండలేం.