Mangoes.. ఇలా తింటే వేడి చేయదు!

Hyderabad: ఎండాకాలం(Summer)లో మాత్రమే అందుబాటులో ఉండే పండ్లు మామిడి పండ్లు(Mangoes). ఈ సీజనల్​ పండ్ల కోసం చాలామంది వేసవి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. మామిడిపండ్లను చాలా మంది ఇష్టంగా తింటారు.  మామిడి పండ్లను తినడం వల్ల ఆరోగ్యానికీ(Health) మంచిదనేది నిపుణుల మాట. కానీ కొందరిలో మామిడిపండ్లను ఎక్కువగా తినడం వల్ల వివిధ రకాల అనారోగ్య సమస్యలు వస్తాయి. గడ్డలు, కళ్లు ఎర్రగా మారడం, శరీరంలో వేడి చేసినట్టుగా ఉండడం, మలంలో రక్తం, మూత్రంలో మంట వంటి సమస్యలు తలెత్తుతాయి. అయితే ఈ సమస్యలకు కారణం మామిడి పండ్లే అని అపోహ పడతారు చాలామంది. కానీ నిజానికి ఎండ తీవ్రత వల్ల శరీరంలో ఉష్ణోగ్రత పెరిగి పలు సమస్యలు తలెత్తుతాయి. అయితే మామిడి పండ్లను నేరుగా కాకుండా ఇతర పద్ధతుల్లో తీసుకుంటే వీటివల్ల కలిగే ప్రయోజనాలు రెట్టింపవుతాయంటున్నారు నిపుణులు.

శరీరంలోని బ్యాక్టీరియా వల్ల గడ్డలు, కురుపులు వస్తాయి. మామిడి పండ్లలో యాంటీ ఫంగల్​ గుణాలు ఎక్కువ. అందువల్ల వీటిని తినడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అయితే మామిడి పండ్లను నేరుగా కాకుండా, సలాడ్లు, జ్యూస్​లు, ఐస్​క్రీం, జెల్లీ, మ్యాంగ్​ మిల్క్​ షేక్​, మ్యాంగో స్మూతీ, మ్యాంగో పన్నా.. ఇలా ఇతర పదార్థాలతో కలిపిప తీసుకోవడం వల్ల వీటివల్ల శరీరానికి చేకూరే లాభాలు రెట్టింపవుతాయి. మామిడి పండ్లలో పాలు కలపడం వల్ల వాటిలోని వేడి లక్షణాలు పోయి ఒంటికి చలువ చేస్తాయి. మామిడి తాండ్ర, మ్యాంగో జెల్లి వంటి వాటిని పిల్లలూ ఇష్టంగా తింటారు. వేసవిలో నీళ్లు ఎక్కువగా తాగాలి. మామిడి పండ్లు తీసుకున్న రోజు మరిన్ని నీళ్లు ఎక్కువ తాగడం మంచిది. శరీరంలో తగిన మోతాదులో నీళ్లు ఉంటే వేడి వల్ల కలిగే సమస్యలు ఏర్పడవు.