World dance day: డ్యాన్స్‌తో ఏ వయసులోనైనా ఆరోగ్యం!
Hyderabad: డ్యాన్స్(world dance day)తో ఏ వయసువారైనా ఆరోగ్యంగా ఉంటారని అంటున్నారు నిపుణులు. డ్యాన్స్(dance) ద్వారా మన భావోద్వేగాలను, మన మనసులో మాటను ఎదుటివారితో వ్యక్తపరుస్తాం. ఈరోజు వరల్డ్ డ్యాన్స్ డే(world dance day) సందర్భంగా.. డ్యాన్స్ ద్వారా మనం పొందే లాభాలు ఏంటో చూద్దాం.
- డ్యాన్స్ చేస్తున్నప్పుడు శరీరం అంతా కదులుతుంది కాబట్టి ఎక్సర్‌సైజ్ అయినట్లు ఉంటుంది.
- డ్యాన్స్‌తో బాడీ ఫ్లెక్సిబుల్‌గా మారుతుంది. నడుము, కాళ్లు పట్టేయడాలు వంటివి ఉండవు.
- కండరాలు బలంగా మారతాయి.
- స్టామినా పెరుగుతుంది. వెన్నముక స్ట్రాంగ్ అవుతుంది.
- మెదడు చురుగ్గా మారుతుంది.
- ఫిజికల్ టాస్కులు ఫాస్ట్‌గా చేయగలుగుతారు.
- మెమొరీ బాగుంటుంది. ప్రతి క్షణాన్ని ఆస్వాదించగలుగుతారు.
- డ్యాన్స్‌ని ఒక సీక్వెన్స్‌లో చేస్తున్నప్పుడు బ్రెయిన్ షార్ప్‌గా మారి అలెర్ట్‌గా ఉంటుంది.