Dosa: దోసెల్లో బేకింగ్ సోడా.. మంచిదా కాదా?

Hyderabad: దోసెలు(dosa) బాగా రావాల‌ని చాలా మంది చిటికెడు బేకింగ్ సోడా(baking soda) వేస్తుంటారు. దోసెల‌నే కాదు కేకులు, ఇడ్లీలు, కుకీస్ ఇలా బేక్ చేసే వాటిల్లో వేస్తుంటారు. మ‌రికొంద‌రు బేకింగ్ సోడాకు బ‌దులు ఈనో వేస్తుంటారు. ఇలా బేకింగ్ సోడా  లేదా ఈనో వేయ‌డం ఆరోగ్యానికి మంచిదా కాదా? నిపుణులు ఏం చెప్తున్నారో చూద్దాం. దోసె, ఇడ్లీ పిండ్లు కాస్త పొంగ‌డానికి ఈ బేకింగ్ సోడా లేదా ఈనో వేస్తుంటారు. కానీ వీటిని త‌యారుచేసుకునేట‌ప్పుడు ప్ర‌తీసారి సోడా, ఈనోలు వంటివి యాడ్ చేయ‌డం చాలా ప్ర‌మాదం అని నిపుణులు చెప్తున్నారు. సోడా వంటివి ర‌క్తంలోని బ్ల‌డ్ పీహెచ్‌ను పెరిగేలా చేస్తాయి. పీహెచ్‌లో మార్పులు వ‌స్తే శ‌రీరం త‌ట్టుకోలేదు. దాంతో అనారోగ్యం పాల‌వుతారు. పీహెచ్ అంటే పొటెన్షియ‌ల్‌ ఆఫ్ హైడ్రోజ‌న్. అంటే హైడ్రోజ‌న్ యొక్క సామ‌ర్ధ్యం. ఇది మ‌న శ‌రీరంలో నిల‌క‌డ‌గా ఉంటే మంచిది. లేదా చిన్న చిన్న అనారోగ్య స‌మ‌స్య‌లుగా మొద‌లై అవి కిడ్నీలు పాడ‌వ‌డం , గుండె జ‌బ్బులు రావ‌డం వంటి పెద్ద జ‌బ్బుల బారిన‌ప‌డేలా చేస్తుంది.

ఇక ఈనో గురించి చెప్పాలంటే దీనిని ఫ్రూట్ సాల్ట్ అని కూడా అంటారు. ఇందులో 60% సోడియం ఉంటుంది. బేకింగ్ సోడాతో పోలిస్తే ఈనో కాస్త బెట‌ర్. కాక‌పోతే ఇది కూడా మితంగానే వాడాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ఈనో వ‌ల్ల కూడా బ్ల‌డ్ ప్రెష‌ర్ ఎక్కువ అవుతుంది. ఈనోని యాంటాసిడ్‌గా వాడ‌తారు. అంటే ఎసిడిటీ ఉన్న‌ప్పుడు తాగితే త‌గ్గుతుంది. ఈ యాంటాసిడ్స్ ఇమ్యూనిటీపై ప్ర‌భావం చూపుతాయి. కాబ‌ట్టి ఈనో అయినా సోడా అయినా వీటిని వాడ‌టం త‌గ్గించేస్తేనే మంచిద‌ని అంటున్నారు. మ‌రి దోసె, ఇడ్లీ పిండ్లు ఎలా పొంగుతాయి అని అనుకుంటే రాత్రే వాటిని నాన‌బెట్టేయండి. స‌హ‌జంగా ఫ‌ర్మెంటేష‌న్ ప్ర‌క్రియ జ‌రుగుతుంది. అలా కాస్త పులుపెక్కితే ఇంకా మంచిది. అది మంచి బ్యాక్టీరియా. జీర్ణ‌క్రియ సాఫీగా ఉంటుంది.