Valentine’s Day: మీరు సింగిలా? అయితే ఈ ప్రేమికుల రోజును ఇలా జ‌రుపుకోండి

Valentine’s Day: వ్యాలెంటైన్స్ డే వ‌చ్చేస్తోంది. రేప‌టి నుంచి వ్యాలెంటైన్ వీక్ మొద‌లైపోతుంది. రేపు రోజ్ డే. ల‌వ‌ర్స్ ఉన్న‌వారికి ఇదో పెద్ద పండుగ. లేని వారికి పాపం ఈ వ్యాలెంటైన్స్ డే అనేదే ఓ దండ‌గ‌. 2024లో అయినా పార్ట్‌నర్ దొర‌క్క‌పోరా అని సింగిల్స్ వెయ్యి క‌ళ్ల‌తో ఎదురుచూస్తున్నారు పాపం. మీరు ఒక‌వేళ సింగిల్ అయితే వ్యాలెంటైన్స్ డే రోజున ఏం చేయాలో తెలుసుకుందాం.

వ్యాలెంటైన్స్ డే కేవ‌లం ప్రేమికులు జ‌రుపుకునే పండుగ అని ఎందుకు అనుకోవాలి? ఆ రోజున ప్రేమికులు, దంప‌తులు ఇలా ఏ జంట అయినా ఒక‌రితో ఒక‌రు ఆనంద క్ష‌ణాల‌ను గ‌డ‌పాల‌ని, ఇంకాస్త స్పెష‌ల్‌గా సెల‌బ్రేట్ చేసుకోవాల‌ని అనుకుంటారు. మ‌రి సింగిల్స్‌కి ఆ హ‌క్కు లేదా? ఉంది. పార్ట్‌న‌ర్‌తోనే ఎంజాయ్ చేయాల‌ని ఏముంది? వ్యాలెంటైన్స్ డే రోజున మీరు మ‌రొక‌రికి పార్ట్‌న‌ర్ అయ్యే బ‌దులు మీకు మీరే అయిపోతే స‌రిపోదా? (valentine’s day)

అర్థంకాలేదా? అదేనండీ.. మిమ్మ‌ల్ని మీరు ఆ రోజున ఇంకాస్త ఎక్కువ ప్రేమించుకోండి. ఎవ‌రు వ‌ద్ద‌న్నారు. ఉదాహ‌ర‌ణ‌కు మీకు న‌చ్చిన రెస్టారెంట్‌కి వెళ్లండి. లేదా మీరే న‌చ్చిన ఫుడ్ వండుకుని తినండి. మీకున్న బ‌డ్జెట్‌లో ఎంతో ఇష్ట‌మైన‌వి కొనుక్కోండి. వ్యాలెంటైన్స్ డే రోజున మీరు ఒక‌సారి హెల్త్ చెక‌ప్ చేయించుకున్నారంటే అంత‌కుమించిన గిఫ్ట్ మరొక‌టి ఉంటుందా చెప్పండి. ఇత‌రుల నుంచి వ‌చ్చే సంతోషం కంటే మ‌న‌తో మ‌న‌కు ఏర్ప‌డే బంధం, సంతోష‌మే ముఖ్యం. కాస్త బుర్ర‌కు ప‌దును పెట్టి ఆలోచిస్తే స‌బ‌బే క‌దా అనిపిస్తుంది.

మీకు వ్యాలెంటైన్స్ డే ప్ర‌త్యేకంగా నిలిచిపోవాలి అనుకుంటే.. అనాథాశ్రమానికి కానీ వృద్ధాశ్ర‌మానికి వెళ్లి వారికి కావాల్సిన‌వి ఇచ్చి కాసేపు వారితో టైం స్పెండ్ చేయండి. మీ జీవితంలో మీరు ఏం మిస్స‌య్యారో వారు మీకు క‌ళ్ల‌కు క‌ట్టిన‌ట్లు చూపిస్తారు. వ్యాలెంటైన్స్ డే పార్ట్‌న‌ర్‌తోనే చేసుకోవాల‌ని ఏమీ లేదండి. మీ బెస్ట్ ఫ్రెండ్స్, త‌ల్లిదండ్రుల‌తో కూడా జ‌రుపుకోవ‌చ్చు. భాగ‌స్వామికి కానుక‌లు ఇస్తేనే అది వ్యాలెంటైన్స్ డే అవుతుంది అనుకోవాల్సిన అవ‌స‌రం ఏమీ లేదు. (valentine’s day)

వ్యాలెంటైన్ వీక్ అంటే ఏంటి?

ఫిబ్ర‌వ‌రి 14న‌ వ్యాలెంటైన్స్ డే అన్న విష‌యం అంద‌రికీ తెలిసిందే. అయితే వ్యాలెంటైన్ వీక్ అనేది వారం రోజులు ఉంటుంది. ఫిబ్ర‌వ‌రి 7న మొద‌లై ఫిబ్ర‌వ‌రి 14తో ఈ వ్యాలెంటైన్ వీక్ ముగుస్తుంది.

ఫిబ్ర‌వ‌రి 7 – రోజ్ డే

ఫిబ్ర‌వ‌రి 8 – ప్ర‌పోజ్ డే

ఫిబ్ర‌వ‌రి 9 – చాక్లెట్ డే

ఫిబ్ర‌వ‌రి 10 – టెడ్డీ డే

ఫిబ్ర‌వ‌రి 11 – ప్రామిస్ డే

ఫిబ్ర‌వరి 12 – హ‌గ్ డే

ఫిబ్ర‌వ‌రి 13 – కిస్ డే

ఫిబ్ర‌వ‌రి 14 – వ్యాలెంటైన్స్ డే