Sleep: నిద్ర బాగా పట్టాలంటే.. ఇలా చేయండి!
Hyderabad: పడుకోగానే (sleep) కొందరు నిమిషాల్లో నిద్రలోకి జారుకుంటారు. ఇంకొందరైతే గంటలు గడుస్తున్నా నిద్రపట్టదు (sleep). ముఖ్యంగా ఇప్పుడున్న జనరేషన్ వారికి తెల్లవారుజామున 3 గంటల వరకు మేల్కొని ఉండటం అలవాటైపోయింది. ఇలాగైతే ఎంత మంచి ఆహారం తిన్నా కూడా నిద్ర సరిగ్గా లేకపోతే అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి ఎలా? 60 సెకన్లలో నిద్రపట్టాలంటే ఏం చేయాలి?
నిద్రపోయే (sleep) ముందు ముఖ్యంగా చేయాల్సిన పని ఏంటంటే.. మీ గ్యాడ్జెట్స్ (electronic gadgets) పక్కనపెట్టేయండి. ఫోన్ చూసుకుంటూ నిద్రపోతుంటారు కొందరు. అలా చేస్తే నిద్ర పట్టడం ఏమో కానీ కళ్లు దెబ్బతింటాయి. పడుకోవడానికి కనీసం అరగంట ముందు అన్ని గ్యాడ్జెట్లకు దూరంగా ఉండండి. బెడ్ ఎక్కగానే మెడిటేషన్ చేయడమో లేదా ఏదైనా పుస్తకం చదవడమో అలవాటు చేసుకోండి. ఇక పడుకోబోయే ముందు కాటన్ దుస్తులు వేసుకోండి. అది కూడా లూస్‌గా ఉన్నవి. దీని వల్ల శరీరం పట్టేసినట్లుగా ఉండదు. మీరు పడుకునే రూం టెంపరేచర్ కూడా సెట్ చేసుకోవడం ముఖ్యం. ఏసీ ఉన్నవారైతే మరీ వణికిపోయేలా పెట్టుకోకండి. దాని వల్ల సబ్ కాన్షియస్ స్లీప్‌లోనే ఉంటారు. అంటే పడుకున్నప్పటికీ మేల్కున్నట్లే ఉంటుంది. పడుకోబోయే ముందు గది మొత్తం బాగా చీకటిగా ఉండేలా చూసుకోండి.
మంచి నిద్రకు మంచి ఆహారం ఎంతో ముఖ్యం. రాత్రి పూట కడుపు నిండిపోయేలా తిన్నా, లేదా అసలు తినకుండా పడుకున్నా అస్సలు నిద్రపట్టదు. నిద్రబాగా పట్టడానికి ఉపయోగ పడే ట్రిప్టోఫాన్. ఇదొక అమైనో యాసిడ్. బాదం, ఓట్స్, పెసరపప్పు, చేపలు, గుడ్లలో ఎక్కువగా ఉంటుంది. వీటిలో ఏవైనా ఒకటి రెండు మీ డైట్‌లో చేర్చుకోండి. ఇక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే.. పడుకోవడానికి గంట ముందు టీ, కాఫీల జోలికి అస్సలు పోవద్దు. వచ్చే నిద్రను కూడా కెఫీన్ ఆపేస్తుంది.