Health: యోని చుట్టూ నలుపు.. తగ్గేది ఎలా?
Health: ఆడవారికి ఎక్కువగా విసిగించే సమస్యలలో యోని చుట్టూ నలుపు ఒకటి. అయితే అది ప్రైవేట్ భాగం కాబట్టి పెద్దగా వర్రీ అవ్వాల్సి అవసరం లేదు. అలాగని వదిలేయలేరు. పైగా ఈ మధ్యకాలంలో లైంగిక చర్యను ఎంజాయ్ చేసే క్రమంలో యోని చుట్టూ ఉండే నలుపు వల్ల తమ భాగస్వామికి ఇబ్బంది కలుగుతోందని బాధపడుతున్నారట. దీని వల్ల మార్కెట్‌లో లభించే రకరకాల క్రీములను వాడేస్తున్నారు. దీని వల్ల నలుపు పోవడం మాట అటుంచితే ఇన్‌ఫెక్షన్లు, దద్దుర్లు వస్తాయి. పలు రకాల క్యాన్సర్లు కూడా వచ్చే ప్రమాదం ఉంది ఆ క్రీములతో. మరి సహజంగా ఆ నలుపుని ఎలా తొలగించుకోవాలి?
కాస్తంత నిమ్మకాయ రసం తీసుకుని అందులో రోజ్ వాటర్ కలపండి. దానిని దూదితో నలుపు ఉన్న చోట రాయండి. కాసేపు ఆరనిచ్చి రుద్ది కడిగేయండి. నిమ్మ నేచురల్ బ్లీచింగ్ ఏజెంట్‌లా పనిచేస్తుంది. రోజ్ వాటర్ యోని భాగాన్ని ఫ్రెష్‌గా ఉంచుతుంది. కావాలంటే ఆ మిశ్రమంలో కాస్త సెనగ పిండి కూడా రాసుకుని కలుపుకోవచ్చు. ఇలా వారంలో మూడు సార్లు చేస్తూ ఉంటే క్రమంగా నలుపు తగ్గుతుంది.
మరో చిట్కా ఏంటంటే.. నిమ్మకాయ రసంలో కాస్త పెరుగు, కాఫీ పొడి, పసుపు వేసి ఆ మిశ్రమాన్ని రాసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. పసుపు కాఫీ పొడి కలిపి రుద్దుకున్నా మంచిదే. అన్నింటి కంటే బెస్ట్ చిట్కా ఏంటంటే.. నిమ్మకాయ రసంలో కాస్త తేనె కలిపి రాసుకోవడం. దీని వల్ల కాస్త త్వరగా ఫలితం కనిపిస్తుంది. ఇలాంటి చిట్కాలు పాటిస్తే సరిపోతుంది. అంతేకానీ త్వరగా ఫలితాలు కనిపించాలని క్రీములు మాత్రం వాడకండి.