Papaya: బ్రేక్‌ఫాస్ట్‌కి బొప్పాయి ఎంతో మేలట!
Hyderabad: బ్రేక్‌ఫాస్ట్‌కి (breakfast) బొప్పాయి పండు (papaya) తింటే ఎన్నో బెనిఫిట్స్ ఉన్నాయని అంటున్నారు పోషకాహార నిపుణులు (nutritionists). అవేంటో చూద్దాం.
మలబద్దకం (constipation)
మలబద్దకంతో బాధపడేవారు ఉదయాన్నే బ్రేక్‌ఫాస్ట్‌లో బొప్పాయి తీసుకుంటే ఎంతో మంచిదట. వారం రోజుల్లో ఈ కాన్‌స్టిపేషన్ నుంచి రిలీఫ్ పొందుతారట.
బరువు తగ్గుతారు (weight loss)
బొప్పాయిలో తక్కువ కేలొరీలు ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు రోజుకు ఒక పండుని బ్రేక్‌ఫాస్ట్‌లో తింటే సరిపోతుంది.
ఇమ్యూనిటీ బూస్టర్ (Immunity Booster)
బొప్పాయిలో యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉంటాయి. ఇన్‌ఫెక్షన్లు, ఇతర కాలానుగుణ రోగాల బారిన పడకుండా చక్కటి ఇమ్యూనిటీని పెంచుతుంది.
గుండెకు ఎంతో మేలు (Good for Heart)
బొప్పాయిలో ఉండే పీచు పదార్థం వల్ల గుండెకు కూడా ఎంతో మేలు. బ్యాడ్ కొలెస్ట్రాల్‌ను తగ్గించి బీపీ అదుపులో ఉంచుతుంది.
చర్మం నిగనిగలాడుతుంది (Good Skin)
బొప్పాయి పండులో ఉండే విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు చర్మాన్ని నిగనిగలాడేలా చేస్తాయి. బొప్పాయిని స్కిన్ డాక్టర్ అని కూడా అంటారు.