Chai: చాయ్‌తో గుండెపోటు.. మీరూ ఇలాగే తాగుతున్నారా?
Chai: చాయ్.. ఈ పదంలోనే ఓ ఎమోషన్ ఉంది. ఎండాకాలంలోనూ కప్పు చాయ్ తాగే వారు ఉన్నారు. అలాంటిది ఇక వర్షాకాలంలో రోజుకు ఓ నాలుగైదే కప్పులు లాగించేయరూ..! అయితే ఈ చాయ్ తాగిన తర్వాత ఎంతటి సాంత్వన కలుగుతుందో.. గుండెకు అంత చేటు కూడా కలుగుతోందని అంటున్నారు ఆరోగ్య నిపుణులు.
చాయ్ వల్ల కలిగే నష్టాలేంటి?
చాయ్ ఎక్కువగా తాగితే ఆరోగ్యానికి మంచిది కాదు.
చాయ్ తాగడం వల్ల ఆకలి మందగిస్తుంది. నిద్రపట్టదు.
చాయ్‌లో కెఫీన్ ఉంటుంది. దీని వల్ల శరీరంలో చెడు కొలెస్ట్రాల్ పెరిగిపోతుంది.
చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైతే గుండె రక్తనాళాల్లో పూడికలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఫలితంగా గుండెపోటుకు దారి తీస్తుంది.
చాయ్ వల్ల ఒంట్లో కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరిగిపోతే ముఖంపై పసుపు రంగు మచ్చలు వస్తాయి. ఉన్నట్టుండి కాళ్ల నొప్పులు, చేతులు కాళ్లు పసుపు రంగులోకి మారుతుండడం వంటివి జరుగుతుంటాయి.
రోజంతా నీరసంగా ఉండటం.. తలనొప్పిగా ఉండటం వంటివి అనిపిస్తుంటే మీరు కెఫీన్ ఎక్కువగా తీసుకుంటున్నారని అర్థం.
కావాలంటే బ్లాక్ టీ లేదా బ్లాక్ కాఫీ తాగచ్చు. ఇది శరీరానికి మంచిదే.