CCF Tea: లాభాలు తెలిస్తే తాగకుండా ఉండలేరు!
Hyderabad: కోవిడ్(covid) కేసులు ఇతర ఇన్‌ఫెక్షన్లు పెరుగుతున్న నేపథ్యంలో ఇమ్యూనిటీ(immunity)ని పెంచుకోవడం ఎంతో ముఖ్యం. కోవిడ్ పుణ్యమా అని చాలా మందికి ఇమ్యూనిటీపై దానిని పెంచుకునే విధానంపై అవగాహన పెరిగింది. అయితే ఇప్పుడు చెప్పబోయే టీ(ccf tea) గురించి తెలిస్తే దానిని తాగకుండా ఉండలేరు. అదే సీసీఎఫ్ టీ. ఇదేదో ఇంగ్లీష్ టీ కాదులెండి. సీసీఎఫ్ అంటే కొరియాండర్, క్యుమిన్, ఫెనెల్. అసలు ఈ టీ బెనిఫిట్స్ ఏంటో తెలుసుకుందాం.
కొరియాండర్ అంటే ధనియాలు, క్యుమిన్ అంటే జీలకర్ర, ఫెనెల్ అంటే సోంపు. ఈ మూడిటిని కలిపి తయారుచేసుకునేదే సీసీఎఫ్ టీ. ఇది రోజూ తీసుకోవడం వల్ల డైజెషన్ బాగుంటుంది. స్కిన్ మెరుస్తుంది. స్కిన్ సమస్యలు దూరమవుతాయి. వాంతులవడం, వికారంగా ఉండటం లాంటివి తగ్గుతాయి. పీరియడ్స్ సమయంలో మహిళలు నొప్పి నివారణకు ట్యాబ్లెట్లు కాకుండా ఈ టీ తీసుకుంటే తక్షిణ ఉపశమనం కలిగిస్తుంది.
ఇంతకీ దీనిని ఎలా తయారుచేసుకోవాలంటే.. ధనియాలు, జీలకర్ర, సోంపు సమానంగా టీస్పూన్ తీసుకోండి. ఒక గిన్నెలో వీటిని వేసి 2 కప్పుల నీళ్లుపోయండి. ఒక 10 నిమిషాల వరకు మరగనివ్వండి. నీళ్లు సగానికి అయ్యాక వడగట్టుకుని తాగేయండి. చేదుగా అనిపిస్తే కొద్దిగా తేనె వేసుకోండి. ఈ టీని రోజూ తాగుతుంటే మీ శరీరంలో జరిగే మార్పులు మీకే తెలుస్తాయి.
ఇది కేవలం సాధారణ సమాచారం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించిన విషయాల్లో వైద్యులను సంప్రదించడం ఉత్తమం