Health: సెక్స్ తర్వాత మూత్రం పోస్తే గర్భం రాదా?
Health: శృంగారం అయ్యాక ఆడవారు మూత్రం పోసేస్తే గర్భం దాల్చరా? ఈ విషయంపై నిపుణులు ఇంట్రెస్టింగ్ విషయాలను వెల్లడించారు. ఈరోజుల్లో ఎలాంటి బిడియం లేకుండా శృంగార సమస్యలు, ఆరోగ్యకరమైన శృంగారం గురించి ప్రతి ఒక్కరికీ అవగాహన ఉండి తీరాల్సిందే. ఇలాంటి అంశాలు మాట్లాడుకోకూడదు అనుకుంటూ ఉంటే అజ్ఞానులుగా మిగిలిపోవడం ఖాయం. అవగాహన లేకపోతే తప్పుడు సమాచారాన్ని తెలుసుకోవాల్సి వస్తుంది.
శృంగారం తర్వాత మూత్రం పోస్తే గర్భం రాదా?
శృంగార చర్య తర్వాత మూత్రం పోస్తే యోనిలోని బ్యాక్టీరియా క్లియర్ అయిపోతుంది. ఇక లైంగిక పరమైన ఇన్‌ఫెక్షన్లు రాకుండా ఉండాలంటే కండోమ్‌లు వాడాల్సి ఉంటుంది. అంతేకాదు.. యోని భాగాన్ని శుభ్రం చేసుకునే సమయంలో యోని నుంచి మలద్వార భాగాన్ని శుభ్రం చేయాలి. అంతేకానీ మలద్వార భాగం నుంచి యోనిని శుభ్రం చేయకూడదు. సగానికి సగం ఇన్‌ఫెక్షన్లు మలద్వారం నుంచి యోని వైపు వేళ్లతో రుద్దడం వల్లే వస్తాయి.
అయితే కొందరి వాదన ఏంటంటే.. శృంగారం తర్వాత యోనిలోకి వీర్యకణాలు వెళ్లాక.. ఆ వెంటనే ఆడవారు మూత్రం పోసేస్తే ఆ మూత్రంలోనే వీర్యకణాలు వెళ్లిపోతాయని తద్వారా గర్భం రాకుండా ఉంటుందని అనుకుంటారు. ఇది నూటికి నూరు శాతం అబద్ధం. అలాంటిదేమీ ఉండదు. మూత్రం పోసినా పోయకున్నా.. వీర్య కణాలు యోని లోపలికి ప్రవేశిస్తాయి. అవి అండంతో కలిస్తే గర్భం తప్పక వస్తుంది.