Constipation: మలబద్ధకం.. గుండెకు ప్రమాదం..!
Constipation: ఈరోజుల్లో దాదాపు 50% మందికి పైగా జనాభాను పీడిస్తున్న జబ్బు ఏదన్నా ఉందంటే అది మలబద్ధకం. మారుతున్న జీవనశైలి.. ఆహారపు అలవాట్ల వల్ల ఈ మలబద్ధక సమస్యలు వస్తాయి. బై వన్ గెట్ వన్ ఆఫర్‌లా మలబద్ధకం ఉన్నవారికి గుండె జబ్బులు ఉచితమట. గుండె విఫలం అవడం, గుండెపోటు, కార్డియాక్ అరెస్ట్‌లు ఈ మలబద్ధకం ఉన్నవారిలో అధికంగా వస్తాయట. అయితే కన్ఫామ్ చేసేందుకు ఇంకొంత పరిశోధన చేయాల్సి ఉందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. కాకపోతే ఇప్పటికే గుండె జబ్బులతో బాధపడుతున్నవారికి మలబద్ధకం కూడా ఉంటోందట.
మలబద్ధకం సమయంలో మలవిసర్జన సరిగ్గా జరగనప్పుడు ముక్కుతంటారు. ఆ సమయంలో రక్త పోటు ఎక్కువగా ఉంటుంది. ఇలా ప్రతిసారీ జరుగుతుంటే గుండె కండరాలపై ప్రభావం పడుతుంది. ఇక వయసు పైబడిన వారికి ఇది ఇంకా రిస్క్. మరి మలబద్ధక సమస్యలు పోవాలంటే ఏం చేయాలి? సింపుల్.. మనం తినే వాటిలో ఫైబర్ అధికంగా ఉంటోందా లేదా అనేది చూసుకుంటే చాలు. మీకు ఏం తినాలో ఎలా తినాలో తెలీకపోతే చక్కగా ఓ వైద్యుడిని కలిసి బాడీ చెకప్ చేయించుకుని డైట్ రాయించుకుంటే సరిపోతుంది.