Online Orders: ఇవి మాత్రం ఆర్డర్ చేసుకోకండి!
Hyderabad: ఈ మధ్య గ్రోసరీ డెలివరీ యాప్స్‌లోనే (online orders) అన్నీ దొరికేస్తున్నాయి. కొన్నేళ్ల క్రితం వరకు కూరగాయలు, సరుకులు కావాలంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్లి తెచ్చుకునేవాళ్లం. ఇప్పుడు డెలివరీ యాప్స్ వచ్చేయడంతో చిన్న చిన్న సామాన్లు కూడా ఆన్లైన్లో కొనేస్తున్నాం. అయితే కొన్ని వస్తువులను మాత్రం ఆన్లైన్లో అస్సలు కొనకూడదు అని హెచ్చరిస్తున్నారు నిపుణులు.
కూరగాయలు (Vegetables)
ఇవి ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకోవడం కంటే అప్పటికప్పుడు తోపుడు బండ్లపై అమ్మేవాళ్ల నుంచి కానీ దగ్గర్లోని రైతు బజార్ల నుంచి కానీ తెచ్చుకోవడం చాలా మంచిది.
దోస (Dosa)
సిగ్వీ, జొమాటోల్లో ఎన్నో రెస్టారెంట్లు ఎన్నో రకాల దోసలు అమ్ముతున్నాయి. మీకు కుదిరితే అదే రెస్టారెంట్‌కి వెళ్లి ఆ వెరైటీలను ట్రై చేయండి. ఎందుకంటే దోస ఆర్డర్ పెట్టుకున్నాక అది వచ్చేసరికి ఆ ఎసెన్స్ పోతుంది.
ఎగ్ డిషెస్ (Egg dishes)
గుడ్డుతో తయారుచేసిన ఏ వంటలైనా ఆర్డర్ పెట్టి మీ దాకా వచ్చేసరికి వాసన వచ్చేస్తుంటాయి. తినబుద్ధి కూడా కాదు. కాబట్టి అలాంటివి కుదిరితే ఇంట్లోనే తయారుచేసుకోండి.
సీ ఫుడ్ (Sea food)
ఇప్పుడు చికెన్, మటన్, సీ ఫుడ్ కూడా ఆన్లైన్ ద్వారా డెలివరీ చేస్తున్నారు. చికెన్, మటన్ సంగతి ఏమో కానీ సీ ఫుడ్ మాత్రం ఎన్ని రోజుల నుంచి వారి దగ్గర నిల్వ ఉందో చెప్పడం కష్టం. ఎందుకంటే చికెన్, మటన్ అప్పటికప్పుడు షాప్స్‌లో దొరకుతాయి. కానీ సీ ఫుడ్ అలా దొరకదు.