Heart Health: గుండె పనితీరును మెరుగుపరిచే వ్యాయామాలు!

Hyderabad: వయస్సుతో సంబంధం లేకుండా చాలామందిలో గుండె(Heart) సంబంధ సమస్యలు తలెత్తుతున్నాయి. గుండె ఆరోగ్యం(Heart Health), పనితీరు మెరుగుపడాలంటే వ్యాయామం(Exercises) తప్పనిసరి. కింది వ్యాయామాలు గుండె పనితీరు(Heart Function) మెరుగుపరిచేందుకు దోహదపడతాయి.

నడవడం(Walking)

ఆరోగ్యానికి ఉపయోగపడే వ్యాయామాల్లో మొదటిది నడవడం. ప్రతిరోజు కనీసం 30 నిమిషాల నడక గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.

స్కిప్పింగ్(Jump rope)

వారానికి ఒకరోజైనా స్కిప్పింగ్​ చేయడం వల్ల గుండె పనితీరు మెరుగుపడుతుంది. దీనివల్ల శరీరంలోని కండరాలన్నింటికీ వ్యాయామం జరుగుతుంది.

వేగంగా నడవడం(Power Walking)

మామూలు నడకతో పోలిస్తే వేగంగా చేతులు ఊపుతూ నడవడం వల్ల శ్వాసవ్యవస్థ పనితీరు మెరుగుపడుతుంది. తద్వారా గుండెకు చక్కని వ్యాయామం అందుతుంది.

ఈత కొట్టడం(Swimming)

ఈత కొట్టడం వల్ల గుండెతో పాటు ఇతర శరీర అవయవాల పనితీరు మెరుగుపడుతుంది.

సైకిల్ తొక్కడం(Cycling​)

రోజూవారి పనుల్లో భాగంగా దగ్గరి దూరాలకు బైక్​లు, కార్లకు బదులు సైకిల్​ను ఉపయోగించడం మంచిది. ఇది గుండె ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది.

పుషప్స్​(Push ups​)

గుండె సమస్యల ముప్పును తగ్గించే వ్యాయామాల్లో పుషప్స్​ ఒకటి. క్రమం తప్పకుండా పుషప్స్​ చేయడం వల్ల గుండె దృఢంగా మారుతుంది.

హులా హూపింగ్​ (Hula hooping)

ఆటలా ఉండే ఈ వ్యాయామం గుండెకు చక్కని వ్యాయామాన్ని అందిస్తుంది.

మెట్లెక్కడం(Climbing stairs)

మెట్లెక్కడం చక్కని వ్యాయామం. లిఫ్ట్​లను వాడటం తగ్గించి మెట్లెక్కడం ఆరోగ్యానికి మంచిది.

పరిగెత్తడం (Running)

పరుగు వల్ల శ్వాసక్రియ మెరుగుపడుతుంది. దీనివల్ల గుండెకు తగినంత ఆక్సిజన్​ అందుతుంది.

ఒక్క కాలుపై నిల్చోవడం(Single leg stand)

ఒక్కో కాలుపై 10 నుంచి 15 సెకండ్లపాటు నిల్చోవడం వల్ల గుండెతోపాటు పొత్తికడుపుకు తగిన వ్యాయామం అందుతుంది.

స్వ్కాట్ జంప్స్ (Squat jumps)

వ్యాయమం చేస్తూ చిన్నచిన్నగా గెంతడం వల్ల రక్తప్రసరణ పనితీరు మెరుగుపడుతుంది.

టో ట‌చింగ్ (Toe touching)

వ్యాయామంలో కూర్చుని, వంగొని కాలి బొటన వేళ్లను తాకడం తప్పనిసరిగా చేయాల్సిన పని. ఇలా చేయడం వల్ల గుండెతోపాటు కాళ్లకు మంచి వ్యాయామం అందుతుంది.

పాకడం(Bear Crawl)

దీన్ని ఇంట్లోనే చేయవచ్చు. నేలపై పాకడం వల్ల మొత్తం శరీరానికి కావాల్సినంత వ్యాయామం అందుతుంది.