Depression: జంక్ ఫుడ్ వల్లే మానసిక రోగాలు
Hyderabad: ఈ మధ్యకాలంలో మానసిక రోగాలు(depression) ఎక్కువైపోతున్నాయి. భారతదేశాన్ని(india) పీడిస్తున్న అనారోగ్య సమస్యల్లో డిప్రెషన్(depression) ఒకటి. ఇందుకు కారణం.. మనం తీసుకునే ఆహారంలో 30% కన్నా ఎక్కువ జంక్ ఫుడ్(junk food) ఉండటమేనట. సాఫ్ట్ డ్రింక్స్, కొన్ని రకాల ప్యాక్డ్ ఫ్రూట్ జ్యూసెస్, తినడానికి రెడీగా ఉండే ఆహారాల కారణంగానే మనిషికి డిప్రెషన్ సంభవిస్తోందని రీసెర్చ్‌లో తేలింది. ఆస్ట్రేలియాకు(australia) చెందిన డేకిన్ యూనివర్సిటీలోని రీసెర్చర్లు 23,000 మంది ఆస్ట్రేలియన్లపై పరిశోధన చేసారు. వారిలో సగం మందికి నెల రోజుల పాటు రోజులో 30% మించిన జంక్ ఫుడ్ తినిపించి చూసారు. మిగతా వారికి పోషకాహారం ఇస్తూ 1% కూడా జంక్ తిననివ్వకుండా చేసారు. అలా వచ్చిన రిజల్ట్స్‌ను బట్టి చూస్తే.. జంక్ ఫుడ్ తిన్నవారిలో విపరీతమైన డిప్రెషన్, మూడ్ స్వింగ్స్ స్టార్ట్ అయ్యాయట. కాబట్టి వీలైనంత వరకు జంక్ ఫుడ్ జోలికి పోకుండా ఉంటే మానసికంగా ఆరోగ్యంగా ఉంటామని నిపుణులు చెప్తున్నారు.