Mango: మామిడిని వీటితో అస్సలు తినకండి
Hyderabad: సమ్మర్‌లో(summer) విరివిగా దొరికే పండు మామిడి(mango). కింగ్ ఆఫ్ ఫ్రూట్స్‌గా పిలవబడే మామిడి(mangoes) పండ్లంటే ఇష్టపడనివారు ఉండరు. అయితే ఈ కాలంలోనే ఎక్కువగా దొరుకుతాయని వాటిని ఎలా పడితే అలా తినకూడదు అంటున్నారు నిపుణులు. ముఖ్యంగా వీటితో కలిపి అస్సలు తినకూడదట.
ఐస్‌క్రీం
ఐస్‌క్రీంలో మామిడి పండు గుజ్జు వేసుకుని తింటుంటారు కొందరు. అది అస్సలు మంచిది కాదు. హాట్ అండ్ కోల్డ్ కాంబినేషన్ వల్ల పలు అనారోగ్య సమస్యలు వస్తాయి.
నిమ్మ, నారింజ
విటమిన్ సి పుష్కలంగా దొరికే నిమ్మ, నిమ్మ జాతి పండ్లతో కలిపి మామిడి పండుని సేవించకూడదు. శరీరంలో పీహెచ్ బ్యాలెన్స్‌పై తీవ్ర ప్రభావం చూపుతుంది.
పెరుగు
చాలా మంది పెరుగు అన్నంలో మామిడి పండు నలుచుకుని తింటుంటారు. టేస్ట్ అదిరిపోతుంది కానీ ఈ రకంగా పెరుగు, మామిడి కాంబినేషన్ మంచిది కాదంటున్నారు.
రెగ్యులర్ మీల్స్
చపాతీలు తినేటప్పుడు మామిడి పండును కూడా తింటుంటారు కొందరు. దీని వల్ల అరుగుదల సమస్యలు వస్తాయి.
కూల్ డ్రింక్స్
కూల్ డ్రింక్ తాగుతూ మామిడి పండు తినకూడదు. బ్లడ్ షుగర్ పెరిగిపోతుంది.
భోజనం చేసిన తర్వాత కనీసం ఒక గంట ఆగి మామిడి పండుని తినండి. అప్పుడు సులువుగా జీర్ణం అవుతుంది. మామిడి పండు తిన్నాక కడుపు నొప్పిగా అనిపించినప్పుడు వెంటనే వైద్యుల్ని సంప్రదించడం మంచిది.