Pregnancy: ముందస్తు వీర్యంతో గర్భం వస్తుందా?
Pregnancy: ఒక యువతి గర్భం దాల్చాలంటే మగాడి వీర్యం అండంతో కలవాలన్నది అందరికీ తెలిసిందే. అయితే వీర్యకణాలు మహిళ యోనిలోకి వెళ్లి అండంతో కలిస్తే గర్భధారణకు దారి తీస్తుందన్న విషయం తెలిసినప్పటికీ.. ముందస్తు వీర్యంతోనూ గర్భం వచ్చే అవకాశాలు ఉన్నాయన్న విషయం చాలా మందికి తెలీదు.
అసలేంటీ ముందస్తు వీర్యం?
ముందస్తు వీర్యాన్ని ఇంగ్లీష్‌లో ప్రీకమ్ (Precum) అంటారు. అంటే వీర్యానికి ముందు అంగం దగ్గర ఒక రకమైన లిక్విడ్ ఉంటుంది. దానినే ముందస్తు వీర్యం అంటారు. కలయిక సమయంలో కోరిక పెంచడానికి అంగాన్ని యోనిపై రుద్దుతుంటారు. ఆ లిక్విడ్ యోనికి అంటి లోపలికి వెళ్తే శృంగార చర్య పూర్తి కాకపోయినా కూడా గర్భం దాల్చే అవకాశాలు లేకపోలేదట. రుతుక్రమం సమయంలో ఈ ముందస్తు వీర్యం వల్ల గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువ. శృంగారం అయిపోయిన తర్వాత వీర్యం మొత్తం బయటికి వచ్చేసాక మగవారు మూత్రం పోయకపోతే ఆ వీర్యం మూత్రంలో ఉండిపోతుంది. కాబట్టి.. ఈ ముందస్తు వీర్యం వల్ల గర్భం దాల్చకూడదు అనుకునేవారు తప్పనిసరిగా కండోమ్స్ వంటి రక్షణలను వాడాల్సిందే అని వైద్యులు చెప్తున్నారు.