Heart Health: గుండె సర్జరీ తర్వాత సెక్స్ చేయచ్చా?
Heart Health: గుండె సర్జరీ కానీ స్టెంట్ వేసాక కానీ సెక్సువల్ లైవ్ ఎంజాయ్ చేయచ్చా అనే సందేహాలు చాలా మందికి ఉంటాయి. అయితే.. ఈ విషయంలో ఒక్కో పేషెంట్‌కి ఒక్కోలా ఉంటుంది. ఉదాహరణకు ఒక వ్యక్తికి స్టెంట్ వేసారనుకోండి.. అతను నాలుగు నుంచి 6 వారాల్లో శృంగార చర్యల్లో పాల్గొనవచ్చు. కానీ అందరికీ ఇలా ఉండదు. కొందరికి ఏడాది రెండేళ్ల వరకు ఆగాల్సి ఉంటుంది. మరికొందరికి అసలు సెక్సువల్ లైఫ్ ఎంజాయ్ చేయలేని పరిస్థితి ఉంటుంది. సాధారణంగా సర్జరీ జరిగిన 6 వారాల తర్వాత శృంగార చర్యల్లో పాల్గొనవచ్చు. అది కూడా వైద్యులు అనుమతిస్తేనే.
సెక్స్ చేస్తున్న సమయంలోనూ మీకు గుండెలో ఎలా ఉందో గమనించుకుంటూ ఉండాలి. ఒకవేళ లైంగిక చర్యలో పాల్గొన్నప్పుడు గుండె దగ్గర స్వల్పంగా నొప్పి రావడం.. ఆయాసంగా అనిపించడం వంటివి ఉంటే క్షణం పాటు కూడా ఆలస్యం చేయకుండా వైద్యులను సంప్రదించాలి. లైంగిక చర్య అనేది కూడా ఒక శారీరక వ్యాయామమే. కానీ అది ఎంత వరకు చేయాలి అనేది వైద్యులను సంప్రదించి తీరాల్సిందే.