Black Rice: న‌ల్ల బియ్యం..పోష‌కాలు బ్ర‌హ్మాండం!

బియ్యం అంటే తెల్లగా ఉంటాయని అందరికీ తెలుసు. కానీ నల్ల బియ్యం గురించి మనలో చాలా మందికి తెలియదు. కొత్త వంగడాల ద్వారా సృష్టించిన ఈ బియ్యంలో మన శరీరానికి కావలసిన పోషక ఖనిజాలు పుష్కలంగా ఉంటాయంటున్నారు నిపుణులు. మధుమేహం, గుండె జబ్బులు వంటి దీర్ఘకాలిక సమస్యలు గలవారు ఈ బియ్యం తినడం మంచిదని నిపుణులు చెబుతుండటంతో ఈ మధ్య కాలంలోనే వీటికి చాలా గుర్తింపు లభిస్తోంది. నల్ల బియ్యంలో 18 రకాల అమినో యాసిడ్స్, కాపర్, కెరోటిన్ వంటివి సమృద్ధిగా ఉండటం వల్ల సూపర్ ఫుడ్ అని పిలుస్తారు. చూసేందుకు నల్లగా ఉన్నా వీటిలో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు దాగి ఉన్నాయి. అందుకు తగినట్టుగానే వీటి ధర కిలోకి దాదాపు 300 రూపాయిల వరకు ఉంటుంది. బ్లాక్​ రైస్​గా ప్రసిద్ధి చెందిన ఈ బియ్యం ప్రస్తుతం అన్ని ఆన్​లైన్​ గ్రోసరీ ప్లాట్​ఫామ్​లు, సూపర్​బజార్లలోనూ లభిస్తున్నాయి. ఈ బియ్యంలోని పోషకవిలువలేంటో, ఇవి మన శరీరానికి చేసే మేలేంటో తెలుసుకుందాం..

* నల్ల బియ్యం తినడం వల్ల ఇన్సులిన్ స్థాయి క్రమబద్ధీకరిచబడతాయి. తద్వారా మధుమేహం నియంత్రణలో ఉంటుంది. ఈ బియ్యంలో కేలరీలు తక్కువగానూ ఫైబర్ ఎక్కువగానూ ఉండటం వల్ల శరీరంలో కొవ్వును చాలా త్వరగా కరిగించి అధిక బరువు సమస్యను తగ్గిస్తుంది. కేరళ ఆయుర్వేదంలో నరాల బలహీనత ఉన్నవారికి ఈ బియ్యాన్ని మసాజ్ చేసేందుకు ఉపయోగిస్తారు.
* ఈ బియ్యంలో ఉండే ఆంకోసైనిన్స్‌ యాంటీ ఆక్సిడెంట్లుగా పనిచేసి రోగ నిరోధక ఎంజైములను క్రియాశీలకం చేసి శరీరంలో రోగనిరోదక వ్యవస్థ బలంగా ఉండేలా చేస్తుంది. లివర్ డీటాక్సిఫికేషన్ లో కూడా ఈ బియ్యం తోడ్పడుతుంది. అధిక రక్త పోటు సమస్య నుంచి కూడా కాపాడి గుండెకు సంబందించిన సమస్యలు లేకుండా చేస్తుంది.
* నల్ల ధాన్యాలు మంచి రుచిని కూడా కలిగి ఉంటాయి. అందుకనే ఎక్కువగా తీపి వంటలు చేయాడనికి నల్ల బియ్యాన్ని ఉపయోగిస్తారు.బ్లాక్ రైస్ లో ఉండే ఫైబర్‌ జీర్ణసంబంధ సమస్యలను తగ్గిస్తుంది. బ్లాక్ రైస్ లో ఆంథోసైయనిన్లు ఎక్కువగా ఉంటాయి. ఆంథోసైయనిన్లు యాంటీ ఆక్సిడెంట్లుగా పని చేయడం వల్ల మంచి కొలెస్ట్రాల్ పెరిగి చెడు కొలెస్ట్రాల్ తగ్గుతుంది.
* ఆంథోసైయనిన్లు గుండె సంబంధిత వ్యాధులు రాకుండా చేస్తాయి. ఫైబర్ సమృద్దిగా ఉండుట వలన కడుపు నిండిన భావన ఎక్కువసేపు ఉండి తొందరగా ఆకలి వేయదు. దాంతో బరువు తగ్గటానికి అవకాశం కలుగుతుంది. బ్లాక్ రైస్‌లోని యాంటీఆక్సిడెంట్లు కాలేయంలో కొవ్వు పెరుకుపోకుండా చేసి కాలేయన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
* ఈ బియ్యంలో సమృద్దిగా ఉండే లుటిన్, జియాక్సంతిన్ వంటి యాంటీ ఆక్సిడెంట్స్ కంటికి సంబందించిన సమస్యలు లేకుండా కంటి చూపు మెరుగుదలకు సహాయపడుతాయి. బ్లాక్ రైస్‌లోని విటమిన్ ఇ , కెరోటినాయిడ్‌లు కూడా కళ్లపై యువి రేడియేషన్‌ను తగ్గిస్తాయి.