Rice: బియ్యంతో ఇన్ని లాభాలా..!

Hyderabad: అన్నం (rice) తింటే లావైపోతార‌ని అనుకుంటారు చాలా మంది. కానీ బియ్యంలో చాలా ర‌కాలు ఉన్నాయ‌ని, వాటి వ‌ల్ల ఎన్నో ఉప‌యోగాలు ఉన్నాయ‌ని చాలా త‌క్కువ మందికే తెలుసు. అస‌లు అన్నం (rice) తిన‌డం వ‌ల్ల క‌లిగే బెనిఫిట్స్ ఏంటో చూద్దాం.

* అన్నం (rice) సులువుగా అరిగిపోతుంది. దాని వ‌ల్ల మెట‌బాలిజం కూడా బూస్ట్ అవుతుంది. ఫ‌లితంగా బ‌రువు త‌గ్గుతారు.

*ఓట్స్ (oats), క్వీన్వాలో (quinoa) ఫ్యాట్ త‌క్కువ ఉంటుంది అనుకుంటారు కానీ నిజానికి వాటి కంటే బియ్యంలోనే త‌క్కువ ఫ్యాట్ ఉంటుంద‌ట‌.

*గ్లూటెన్ అస్స‌లు ఉండ‌ద‌ట‌. కాక‌పోతే మ‌రీ పాలిష్డ్ రైస్ కాకుండా దంపుడు బియ్యం తెచ్చుకుని తింటే ఎంతో మంచిది.

*బియ్యంలో న‌ల్ల బియ్యం, ఎర్ర బియ్యం అని కూడా ఉంటాయి. తెల్ల బియ్యంతో పోలిస్తే వీటిలో విట‌మిన్ B, మెగ్నీషియం, ప్రొటీన్ ఉంటాయి.

*BP, బ్ల‌డ్‌లోని కొవ్వును త‌గ్గించ‌డంలో బియ్యంలో ఉండే ప్రొటీన్ ఎంతో సాయ‌ప‌డుతుంద‌ని రీసెర్చ్‌లు చెప్తున్నాయి.

*కాక‌పోతే ఆల్రెడీ అనారోగ్య స‌మస్య‌ల‌తో బాధ‌ప‌డుతున్న‌వారు ఆహార విషయాల్లో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాలి. త‌ప్ప‌కుండా వైద్య‌ల‌ను సంప్ర‌దించి డైట్ ప్లాన్ చేసుకోవ‌డ‌మే ఉత్త‌మం.