Garlic: వెల్లుల్లి.. వర్షాకాలంలో నో లొల్లి
Hyderabad: ఏ వంటలోనైనా వెల్లుల్లి వేస్తేనే దానికి రుచి వస్తుంది. వెల్లుల్లి (garlic) లేని వంటిల్లు ఉండదని అంటారు. ఆ వెల్లుల్లిని రోజూ ఉదయాన్నే పరగడుపున ఒకటి తింటే ఏమవుతుందో తెలుసా?
గుండెకు ఎంతో మేలు
రోజూ పరగడుపున ఒక వెల్లుల్లి (garlic) తిని చూడండి. పొద్దున్నే అంటే కాస్త వికారంగా ఉంటుంది. అయినా ఫర్వాలేదు. ఒకసారి వెల్లుల్లి (garlic) రోజూ ఉదయాన్నే తినడం మొదలుపెట్టే ముందు ఒకసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ (lipid profile) చేయించుకోండి. ఒకవేళ మంచి కొలెస్ట్రాల్ అయిన HDL ఎక్కువగా ఉండి చెడు కొలెస్ట్రాల్ అయిన LDL తక్కువగా ఉందనుకోండి. మీ గుండె పదిలం అని అర్థం. అదే LDL ఎక్కువగా ఉందనుకోండి.. రోజూ ఒక వెల్లుల్లి తిని చూడండి. ఇలా కేవలం రెండు వారాలు తిన్నాక మళ్లీ ఓసారి లిపిడ్ ప్రొఫైల్ టెస్ట్ చేయించుకుని చూడండి. LDL కచ్చితంగా తక్కువ అని వస్తుంది. కాకపోతే వెల్లుల్లి (garlic) తింటున్నాం కదా అని ఇష్టమొచ్చినట్లు పచ్చళ్లు, నూనెలు, కొవ్వు పదార్థాలు తినేస్తే లాభం లేదు.
ఇన్‌ఫ్లమేషన్ తగ్గుతుంది
మన ఒంట్లో ఏర్పడే ఎన్నో రోగాలకు ఈ ఇన్‌ఫ్లమేషన్ మూల కారణం. వెల్లుల్లి తినడం అలవాటు చేసుకుంటే ఈ ఇన్‌ఫ్లమేషన్ పని పట్టచ్చు.
క్యాన్సర్ రాదు
వెల్లుల్లిలో క్యాన్సర్ (cancer) వచ్చే రిస్క్ తగ్గించే ప్రాపర్టీస్ ఉంటాయట. దీనిపై ఇంకా సైంటిఫిక్ రీసెర్చ్ జరుగుతోంది. అయినప్పటికీ ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్స్ పాజిటివ్‌గానే ఉన్నాయని చెప్తున్నారు నిపుణులు.
డీటాక్సిఫికేషన్
వారానికోసారి ఇంటిని శుభ్రం చేసినట్లు.. మన శరీరాన్ని కూడా చేసుకోవాలి. బయటి నుంచైతే స్నానం చేస్తాం. మరి లోపలి నుంచి ఏం చేయాలి? డీటాక్సిఫికేషన్ (detoxification) చేయాలి. రోజుకో వెల్లుల్లి (garlic) తినడం వల్ల విష పదార్థాలు వాటంతట అవే పోతాయి.
ఇమ్యూనిటీ పెరుగుతుంది
అసలే వర్షాకాలం. ఇమ్యూనిటీ ఎంత బాగుంటే రోగాలకు అంత దూరంగా ఉంటాం. వెల్లుల్లి రోజూ తినలేం రా బాబూ అనుకునేవారు కనీసం ఈ వర్షాకాలం పూర్తయ్యేవరకైనా తినండి.