Curd Rice: పెరుగ‌న్నం చేసే మేలెంతో తెలుసా?

Hyderabad: మ‌న తెలుగు సంప్ర‌దాయంలో ఏ భోజనం అయినా పెరుగ‌న్నంతోనే (curd rice) ముగుస్తుంది. ఎందుకో కొంద‌రికైతే అస‌లు పెరుగన్నం (curd rice) తిన‌డం అంటేనే అస్స‌లు న‌చ్చ‌దు. అస‌లు పెరుగ‌న్నం తింటే క‌లిగే లాభాలు ఏంటో తెలిస్తే వదిలిపెట్ట‌రు.

పెరుగ‌న్నంలో ప్రో బ‌యోటిక్స్ (probiotic) ఉంటాయి. పులియ‌పెట్టిన ఆహారాల్లో ఈ ప్రో బయోటిక్స్ ఉంటాయి. దీని వ‌ల్ల జీర్ణ వ్య‌వ‌స్థ‌లో ఆరోగ్య‌క‌ర‌మైన బ్యాక్టీరియా పెరుగుతుంది. అది జీర్ణ‌క్రియ‌ను బాగా అయ్యేలా చేస్తుంది. ఫ‌లితంగా మ‌ల‌బ‌ద్ధ‌కం రాదు. పెరుగులో కాల్షియం (calcium) ఎక్కువగా ఉండ‌టం వ‌ల్ల ఎముక‌ల‌కు, ప‌ళ్ల‌కు ఎంతో మేలు. అంతేకాదు.. పెరుగులో విట‌మిన్ డి (vitamin d) కూడా ఎక్కువే. విట‌మిన్ డి ఉంటేనే బాడీకి కావాల్సిన కాల్షియం అందుతుంది.

ఇక పెరుగు, అన్నం క‌లిపి తింటున్నాం కాబ‌ట్టి శ‌రీరానికి కావాల్సిన ప్రొటీన్ (protein) అందిన‌ట్లే. బాడీలో కొత్త టిష్యూలు పుట్టించే శ‌క్తి ప్రొటీన్‌కు ఉంటుంది. ఫ‌లితంగా కండ‌రాల బ‌లం కూడా పెరుగుతుంది. ఈ పెరుగ‌న్నం ఎక్కువ‌గా డిన్నర్ వేళ‌ల్లో తింటేనే మంచిది. క‌డుపు నిండిన‌ట్లుగా ఉంటుంది కాబ‌ట్టి రాత్రి వేళ్ల‌ల్లో ఆక‌లి వేయ‌కుండా ఉంటుంది. అప్పుడు స్నాక్స్ లాంటి వాటికి దూరంగా ఉంటాం. బ‌రువు కూడా పెర‌గ‌రు. కేవ‌లం పెరుగ‌న్నం (curd rice) తిన‌లేనివారు అందులో కొన్ని దానిమ్మ గింజ‌లు లేదా మీకు అందుబాటులో ఉన్న ఏవైనా పండ్లను క‌లుపుకుని తినండి. మొత్తానికైతే పెరుగ‌న్నాన్ని ఒక అలవాటుగా మార్చుకోండి.