Pineapple: ఒక్క పండు.. బోలెడు లాభాలు!
Hyderabad: ఏ కాలంలోనైనా విరివిగా దొరికే పండు అనాస (pineapple). ఈ పండు తినడం వల్ల కలిగే లాభాలు చాలానే ఉన్నాయని అంటున్నారు వైద్య నిపుణులు. అవేంటో చూద్దాం.
*పైనాపిల్‌లో (pinapple) కేలొరీలు తక్కువ పోషకాలు ఎక్కువ. ప్రొటీన్, విటమిన్ C కూడా పుష్కలంగా ఉంటుంది.
*వారానికి ఒక పండు పూర్తిగా తిన్నా.. అలసట (fatigue) అనేది తగ్గిపోతుంది.
*డైజెషన్ (digestion) కూడా సులువుగా అవుతుంది. అందుకే బ్రెజిల్ (brazil) లాంటి దేశాల్లో మాంసాహారాల్లో పైనాపిల్‌ను (pineapple) కూడా వడ్డిస్తారు.
*రెగ్యులర్ డైట్‌లో అనాసపండును చేర్చుకుంటే క్యాన్సర్ (cancer) రిస్క్ కూడా తగ్గుతుంది.
*దీనిని మించిన ఇమ్యూనిటీ (immunity) బూస్టర్ మరొకటి లేదు.