Ghee: రోటీల్లో నెయ్యి మంచిదేనా?

Hyderabad: నెయ్యి రుచే వేరు. దాని వాస‌న చూస్తేనే నోరూరిపోతుంటుంది. కానీ ఒళ్లు వ‌చ్చేస్తుందేమోన‌ని చాలా మంది నెయ్యికి (ghee) దూరంగా ఉంటారు. అందుకే చపాతీల‌లో, రోటీల్లో నెయ్యిని (ghee) పుయ్య‌కుండా తినేస్తుంటారు. అస‌లు రోటీల్లో నెయ్యి వేసుకుని తింటే ఏమ‌వుతుంది?

*రోటీల‌పై నెయ్యి (ghee) పూసుకుంటే దాని రుచి రెట్టింపు అవుతుంది. పైగా రోటీలు (rotis) త‌డి ఆరిపోకుండా కూడా ఉంటాయి.

*నెయ్యిలో ఆరోగ్య‌క‌ర‌మైన కొవ్వులు ఎక్కువ‌గా ఉంటాయి. విట‌మ‌న్ల‌కు కూడా కొద‌వ లేదు. ఒంట్లో కొత్త క‌ణాలు పుట్ట‌డానికి, హార్మోన్ ఇమ్‌బ్యాలెన్స్ అవ్వ‌కుండా ఉండ‌టానికి అవి హెల్ప్ చేస్తాయి.

*రోటీల్లో నెయ్యి (ghee) లేకుండా తినేస్తే అవి అర‌గ‌డానికి చాలా స‌మ‌యం ప‌డుతుంది. అదే నెయ్యి పూసుకుని తింటే రోటీల్లో తేమ త‌గ్గ‌కుండా ఉంటుంది. జీర్ణ స‌మ‌స్య‌లు కూడా రాకుండా ఉంటాయి.

*కొన్ని ర‌కాల ఫుడ్స్‌లో నెయ్యి వేసుకుని తింటేనే వాటి నుంచి ఒంటికి అందాల్సిన విట‌మిన్స్, మిన‌ర‌ల్స్ అందేందుకు నెయ్యి స‌హ‌కరిస్తుంది.

*రోటీలు తింటే మంచిదే. అందులో నెయ్యి వేసుకుని తిన‌డం వ‌ల్ల మరింత ఎన‌ర్జిటిక్‌గా ఉంటారు.

*ఒంట్లో ఇత‌ర స‌మ‌స్య‌ల‌కు కార‌ణ‌మ‌య్యే ఫ్రీ రాడిక‌ల్స్ ఫార్మ్ అవ్వ‌కుండా నెయ్యి కాపాడుతుంది.