bad cholesterol: వీటి వ‌ల్లే ముప్పు

Hyderabad: మారుతున్న జీవనశైలిలో ఆహారపు అలవాట్లలోనూ చాలా మార్పులు వచ్చాయి. జంక్​ఫుడ్(junk food)​, ప్యాకేజ్డ్ ఫుడ్(packaged food)​ వాడకం బాగా పెరిగింది. వీటిలో వాడే ప్రిజర్వేటివ్స్​ శరీరంలో చెడు కొలెస్ట్రాల్​(bad cholesterol)ని పెంచి రక్తపోటు, ఒబేసిటీ, మధుమేహం వంటి దీర్ఘకాలిక సమస్యలను కలిగిస్తాయంటున్నారు నిపుణులు.

* బిస్కెట్లు, కేకులు, పేస్ట్రీలు, పఫ్‌లు, క్రీమ్ రోల్స్ మొదలైన బేకరీ ఫుడ్​లో కొవ్వు స్థాయిలు ఎక్కువ. ఇవి శరీరంలో చెడు కొలెస్ట్రాల్‌ను పెంచుతాయి. సాసేజ్‌లు, సలామీ, బర్గర్ ప్యాటీలు, బేకన్ మొదలైన ఫ్రోజెన్​ ఫుడ్​లో  ఉప్పు, రసాయన సంరక్షణకారులను జోడించి నిల్వచేస్తారు. ఇవి చెడు కొలెస్ట్రాల్‌ పెంచడమే కాదు, కాన్సర్​ కారకాలను కలిగి ఉంటాయి. పావ్ భాజీ, సమోసా, భాతుర్, పిజ్జా, బర్గర్ల​లోనూ ఎల్‌డిఎల్ కొలెస్ట్రాల్ అధికంగా ఉంటుంది. వీటిని తరచుగా తినడం వల్ల మధుమేహం, ఊబకాయం, పీసీఓడీ వంటి సమస్యలు వచ్చే అవకాశం ఎక్కువ.

* పండ్లు, కూరగాయలలో ఫైబర్ అధికంగా ఉంటుంది. దీనితో పాటు యాంటీఆక్సిడెంట్ లక్షణాలను కలిగి ఉన్న ఫైటోన్యూట్రియెంట్లు కూడా పుష్కలంగా ఉంటాయి. ఓట్స్, బఠానీలు, యాపిల్, జామ, క్యారెట్, సిట్రస్ పండ్లలో కరిగే ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. వీటిని ఆహారంలో చేర్చుకోవడం మంచిది. ప్యాక్ చేసిన పండ్ల రసాలు, అధిక ఫ్రక్టోజ్ కార్న్ సిరప్ కలిగిన ఉత్పత్తులు, వైట్ బ్రెడ్ వంటి స్టేపుల్స్ లేదా డెజర్ట్‌లలో కొవ్వు తక్కువగా ఉన్నప్పటికీ చక్కెర స్థాయిలు ఎక్కువగా ఉంటాయి.