Testosterone Replacement Therapy: సెక్స్ డ్రైవ్‌ని పెంచే ఈ థెరపీ గురించి తెలుసా?
Testosterone Replacement Therapy: ఇప్పుడున్న కాలంలో జీవన శైలి వల్ల కానీ ఒత్తిళ్ల వల్ల కానీ సెక్స్ లైఫ్ చేజారిపోతోంది. తమ పార్ట్‌నర్‌తో సరైన శారీరక ఆనందాన్ని పొందలేకపోతున్నారు. ఒకప్పుడు 50 ఏళ్లు వచ్చినా కూడా దంపతుల మధ్య సెక్స్ లైఫ్ చాలా యాక్టివ్‌గా ఉండేది. ఇప్పుడు 30 ఏళ్లకే ఆ లిబిడో (కోరిక) చచ్చిపోతోంది. వయసు పెరుగుతున్నా పార్టనర్స్ మధ్య సెక్స్ లైఫ్ బాగుండాలంటే ఏం చేయాలి? ఇది తెలుసుకునే ముందు మన మగవారు, ఆడవారిలో కోరికను పుట్టించేందుకు కారణం అయ్యే హార్మోన్ల గురించి తెలుసుకుందాం.
ఈస్ట్రోజన్
ఇది ఆడవారిలో ఉండే హార్మోన్. ఈస్ట్రోజన్ హార్మోన్ బాగుంటే సగం ఆరోగ్యం ఉన్నట్లే. ఈ హార్మోన్ శరీరంలో బాగా పనిచేస్తుంటే సమయానికి పీరియడ్స్ వస్తాయి, థైరాయిడ్ బాగుంటుంది, గుండె పనితీరు కూడా బాగుంటుంది. ఒక్క ముక్కలో చెప్పాలంటే ఈ ఈస్ట్రోజన్ అనే హార్మోన్ వల్లే అమ్మాయిలకు ఉండాల్సిన వక్షోజాలు, యోని ఏర్పడతాయి. అడ్రినల్ గ్రంథులు, అండాశయం, ఫ్యాట్ సెల్స్ నుంచి ఈస్ట్రోజన్ ఉత్పత్తి అవుతుంది. ఈ ఈస్ట్రోజన్ వల్ల శరీరంలో చాలా అవయవాల పనితీరు ఆధారపడి ఉంటుంది. ఈ ఈస్ట్రోజన్ అనేది ఇప్పుడున్న రోజుల్లో అయితే ఆడవారికి 35 ఏళ్లు రాగానే అంతగా ఉత్పత్తి అవ్వడం లేదు. ఫలితంగా పీరియడ్స్ సరిగ్గా రాకపోవడంతో ఇతర అనారోగ్య సమస్యలు వస్తుంటాయి.
టెస్టోస్టిరాన్
ఆడవారికి ఈస్ట్రోజన్ అనేది ఎలా ఉంటుందో మగవారికి టెస్టోస్టిరాన్ అనే హార్మోన్ ఉంటుంది. ఈ హార్మోన్ వల్లే వారికి వయసు వచ్చాక రావాల్సిన గెడ్డం వంటివి వస్తుంటాయి. ఈ టెస్టోస్టిరాన్ అనేది జననాంగం కింద ఉండే వృషణాల్లో ఏర్పడుతుంది. ఇది వయసు పెరిగే కొద్దీ ఉత్పత్తి అవ్వడం కూడా పెరుగుతుంది.
ఇప్పుడు మన ఈస్ట్రోజన్, టెస్టోస్టిరాన్ హార్మోన్ల గురించి తెలుసుకుందాం. ఈ రెండు హార్మోన్లకు సెక్స్ లైఫ్‌కి సంబంధం ఏంటో తెలుసుకుందాం. ఈ రెండు హార్మోన్లు ఆడ, మగవారిలో బాగా ఉత్పత్తి అవుతుంటేనే సెక్స్‌పై కోరిక పుడుతుంది. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఆడవారిలోనూ కొంత టెస్టోస్టిరాన్ ఉంటుంది. ఆ టెస్టోస్టిరాన్ ఆడవారిలో లోపించినా కూడా వారికి సెక్స్ లైఫ్ ఎంజాయ్ చేయాలని అనిపించదట.
ఇప్పుడు మనం ఈ అంశం గురించి ఎందుకు మాట్లాడుకుంటున్నామంటే.. టైటానిక్ హీరోయిన్ కేట్ విన్‌స్లెట్ టెస్టోస్టిరాన్ రీప్లేస్మెంట్ థెరపీ చేయించుకున్నారు. ఈ విషయాన్ని ఆవిడ స్వయంగా మీడియా ముందు వెల్లడంచడంతో ఈ థెరపీ గురించి ఆడవాళ్లు తెగ సెర్చ్ చేసేస్తున్నారట. ఇప్పుడు కేట్ విన్‌స్లెట్ వయసు 48 సంవత్సరాలు. ఈ వయసులో ఆమెకు లిబిడో (కోరిక) తగ్గడంతో ఈ థెరపీ చేయించుకున్నట్లు తెలిపారు. ఈ థెరపీని తన లాగా లిబిడోను కోల్పోయిన ఆడవాళ్లంతా కూడా చేయించుకోవచ్చని.. గైనకాలజిస్ట్‌లను సంప్రదిస్తే వారు మరింత సమాచారం ఇస్తారని తెలిపారు. ఈ థెరపీ చేయించుకోవడం వల్ల తాను 20ల్లో సెక్స్ ఎంజాయ్ చేసినట్లు చేస్తున్నానని.. ఈ విషయంలో తన భర్త కూడా ఎంతో హ్యాపీగా ఉన్నారని అంటున్నారు.