Stress: ఒత్తిడితో వీర్యకణాల్లో వేగం
Stress: ఒత్తిడి ఆరోగ్యానికి అస్సలు మంచిది కాదు. ఇప్పుడు చిన్న పిల్లాడిని అడిగినా ఇదే మాట చెప్తాడు. అయితే.. ఒత్తిడి వల్ల వీర్యకణాలకు మంచిదని కొత్త పరిశోధనలు చెప్తున్నాయి. ఒత్తిడికి లోనైన తర్వాత వీర్యకణాల మూవ్‌మెంట్ మెరుగుపడే అవకాశాలు ఉన్నాయట. ఈ విషయాన్ని యూనివర్సిటీ ఆఫ్ కొలరాడోకి చెందిన పరిశోధకలు వెల్లడించారు. ఒత్తిడికి లోనైన తర్వాత సెక్స్‌లో పాల్గొంటే ఆ సమయంలో గర్భం దాల్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నట్లు చెప్తున్నారు. వీర్యకణాలు ఉత్పత్తి కావాలంటే ఎక్స్‌ట్రా సెల్యులార్ విసికిల్స్ అనే సూక్ష్మమైన పార్టికల్స్ అవసరం. ఈ పార్టికల్స్ ఒత్తిడికి ప్రభావితం అవుతాయి.
అయితే ఈ వీర్యకణాల మూవ్‌మెంట్‌లో మెరుగుదల అనేది ఒత్తిడికి లోనవుతున్న సమయంలో కాకుండా.. ఒత్తిడికి లోనైన తర్వాత మెరుగుపడతాయట. ఈ మార్పు మనుషుల్లోనే కాదు జంతువుల్లో కూడా కనిపించింది. అంతేకాదు., కోవిడ్ సమయంలో విపరీతంగా శిశు జననాలు ఎక్కువయ్యాయి. ఇందుకు కారణం కోవిడ్ సమయంలో అందరూ ఒత్తిడిలో ఉండటమేనట. ఇక్కడి వరకు బాగానే ఉంది కానీ.. ఆ ఒత్తిడి కడుపులోకి బిడ్డపై.. బిడ్డ మెదడు ఎదుగుదలపై ఎలాంటి ప్రభావం చూపుతుంది అనే విషయంపై పరిశోధనలు చేస్తున్నారు.