DKతో వైఎస్ షర్మిల భేటీ.. ఆమె పార్టీ మారేది ఎప్పుడంటే?
hyderabad: ఏపీ(Ap)లో పొత్తుల రాజకీయాలు కొనసాగుతున్న వేళ.. తెలంగాణ(telangana)లో కూడా అక్కడి ప్రతిపక్షపార్టీలు పొత్తులపై దృష్టిసారించాయి. ఏపీలో జనసేన(janasena), టీడీపీ(tdp).. అవకాశం ఉంటే.. బీజేపీ(bjp) కలిసి వచ్చే ఎన్నికల్లో పొత్తుతో బరిలో దిగబోతున్నట్లు తెలుస్తోంది. ఇక తెలంగాణలో ఈ ఏడాది చివరికి ఎన్నికలు జరగనున్నాయి. దీంతో బీఆర్ఎస్(brs)కు ప్రధాన ప్రతిపక్షాలు అయిన కాంగ్రెస్(congress), బీజేపీ పార్టీ అగ్రనేతలు వ్యూహాలు రచిస్తున్నారు. తాజాగా కర్నాటకలో కాంగ్రెస్ ఘన విజయం సాధించి.. తెలంగాణపై కన్నేసింది. ఇక్కడ ఉన్న బలమైన నాయకులను పార్టీలోకి ఆహ్వానించడం అది కుదరకపోతే.. పొత్తు పెట్టుకునేందుకు సిద్దమైంది. అందులో భాగంగా.. వైఎస్‌ఆర్‌టీ అధ్యక్షురాలు షర్మిల(ys Sharmila)తో కర్నాటక రాష్ట్ర కేపీసీసీ చీఫ్ డీకే శివకుమార్(dk siva kumar) మంతనాలు జరుపుతున్నట్లు సమాచారం. వచ్చే ఎన్నికల్లో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో కలపాలని, కనీసం పొత్తులతో అయినా వెళ్లాలని ఆ దిశగా చర్చలు సాగుతున్నాయి. షర్మిల ఇప్పటికే కేసీఆర్‌ను బలంగా ఎదుర్కొంటూ.. పాదయాత్ర, ఇతర నిరసన కార్యక్రమాలను నిర్వహించారు. దీంతోపాటు.. షర్మిలకు స్వతహాగా.. వాక్ చాతుర్యం ఉంది. ప్రజల్ని కూడా ఆకర్షించే సామర్థ్యం ఆమెకు ఉంది. దీంతో షమ్మీని ఏవిధంగా అయినా.. కాంగ్రెస్‌లోకి ఆహ్వానించే పనిలో అగ్రనేతలు ఉన్నారు.
ఇక కాంగ్రెస్ పార్టీలోకి రేవంత్ రెడ్డి(revanth reddy) ఎంట్రీ తర్వాత ఆ పార్టీ స్వరూపం మారిందని చెప్పవచ్చు. కేసీఆర్(cm kcr)ను ఢీ అంటే ఢీ అని ఎదురొడ్డి నిలబడ్డ వ్యక్తి రేవంత్.. అలాంటి వ్యక్తి పార్టీలోకి వచ్చిన తర్వాత నుంచి తెలంగాణలో వేగంగా కాంగ్రెస్ బలం పుంజుకుంటోంది. ఇప్పటికే కాంగ్రెస్‌కు క్షేత్రస్థాయిలో మంచి కేడర్ ఉంది. వారికి దిశానిర్దేశం చేసే నాయకులే కరువయ్యారు. ఇప్పటికీ ఆ పార్టీలో గ్రూపు రాజకీయాలు నడుస్తున్నాయి. అయితే ఇవన్నీ అన్ని రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఉన్న తలనొప్పులే. వీటిని అధిగమించి కర్నాటకలో కాంగ్రెస్ గెలుపొందింది.