YSRCP ఎమ్మెల్యేని కొట్టిన ఓటరు.. బాగా బుద్ధి చెప్పారన్న షర్మిళ
YS Sharmila: తెనాలి వైఎస్సార్ కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్ధి శివ కుమార్ పోలింగ్ బూత్ వద్ద ఉన్న ఓటరును కొట్టడం.. తిరిగి అతను శివ కుమార్ చెంప ఛెళ్లుమనిపించడం వైరల్‌గా మారింది. పోలింగ్ బూత్ వద్ద ఓటర్లు లైన్‌లో వేచి చూస్తుంటే.. శివ కుమార్ మాత్రం వీఐపీలా నేరుగా లోపలికి వెళ్లి ఓటేసి బయటికొచ్చారు. ఆ సమయంలో అక్కడే ఉన్న ఓ వ్యక్తి లైన్‌లో నిలబడాలి కదా సార్ అని ప్రశ్నించారు. దాంతో శివ కుమార్ అతన్ని కొట్టాడు. ఆ ఓటరు కూడా శివకుమార్‌పై చేయి చేసుకున్నాడు.
దాంతో శివ కుమార్ అనుచరులు పాపం ఆ ఓటరును చితకబాదారు. వెంటనే కలగజేసుకున్న పోలీసులు తప్పు చేసిన శివకుమార్‌ను అదుపులోకి తీసుకోకుండా ఆ ఓటరును స్టేషన్‌లో పెట్టారు. విషయం ఈసీ అధికారులకు తెలీడంతో వెంటనే శివకుమార్‌ను హౌస్ అరెస్ట్ చేయాలని ఆదేశాలు జారీ చేసారు.
మంచి పని చేసాడు : షర్మిళ
కాగా.. శివకుమార్ చేసిన తప్పును ఓ సాధారణ ఓటరు తీవ్రంగా ఖండించడంపై APCC అధ్యక్షురాలు వైఎస్ షర్మిళ హర్షం వ్యక్తం చేసారు. ఇలాంటివారికి ప్రజలే బుద్ధి చెప్తారు అని ట్వీట్ చేసారు. “” తెనాలిలో మదమెక్కిన వైకాపా అభ్యర్థి చెంపచెళ్లుమనిపించిన ఓటరు చెప్పకనే చెప్పారు. అధికారమదంతో, అహంకారం, అరాచకం సృష్టించే రౌడీ మూకలకు ప్రజలు ఎప్పుడూ బుద్ధిచెబుతూనే ఉంటారు, ఎటొచ్చి ఓటుతో కాకుండా చెప్పులతో, చెంపచెళ్ళుమనేటట్లు చేసుకుంటున్నందుకు వైసీపీ వాళ్ళు సిగ్గుపడాలి. ఇలాంటి వాళ్లకు ప్రజలే సరిగ్గా బుద్ధి చెప్తారు “” అని తెలిపారు.