ఆయన వేరొకరితో ఉన్నా ఓకే.. భర్త సంతోషంగా ఉంటే చాలట
ఈ ప్రపంచంలో అత్యంత శక్తిమంతమైన రిలేషన్స్‌లో భార్యా భర్తల రిలేషన్ ఒకటి. ఇద్దరూ ఒకరినొకరు అర్థంచేసుకుంటూ ముందుకు వెళితేనే ఆ బంధం చివరిదాకా నిలబడుతుంది. అలాంటిది భార్య ఉండగానే భర్త వేరొక మహిళతో గడిపితే ఏ ఆడదైనా ఊరుకుంటుందా? అస్సలు భరించలేదు. వేరే మహిళలతో అక్రమ సంబంధాలు పెట్టుకుంటున్నాడని భర్తలను చంపేసిన భార్యల గురించి చాలానే విన్నాం. కానీ పై ఫోటోలో కనిపిస్తున్న యువతి గురించి తెలిస్తే మాత్రం షాకవుతారు. ఎందుకో తెలుసా? తన భర్త వేరొక అమ్మాయితో గడిపినా తనకు సంతోషమేనట. అవును.. మీరు విన్నది నిజమే. ఇంతకు ఆ అమ్మాయి అలా ఎందుకంటోందో చూద్దాం.
అమెరికాకు చెందిన మోనికా, జాన్ భార్యాభర్తలు. ఇద్దరి మధ్య ఎలాంటి గొడవలు లేవు. పిల్లలు లేకపోయినా సంతోషంగానే జీవిస్తున్నారు. జాన్ ఉద్యోగం చేస్తున్నాడు. మోనిక ఇంటిపని చూసుకుంటూ ఉంటుంది. కొన్ని సార్లు మోనికకు ఇంట్లో పని ఎక్కువగా ఉంటే తన భర్తను పట్టించుకునే సమయం దొరకడంలేదట. అలా తన భర్తకు తన నుంచి రావాల్సినవి ఇవ్వలేనప్పుడు పరాయి మహిళలతో గడిపి రావచ్చు అనే ఆప్షన్ ఇచ్చిందట. ఈ విషయం మోనికనే స్వయంగా ఓ కార్యక్రమంలో వెల్లడించింది.
“నాకు ఒక్కోసారి ఇంటి పనులతో క్షణం తీరిక ఉండదు. దాంతో జాన్ ఒక్కోసారి ఒంటరిగా ఫీల్ అవుతాడు. అతనికి శారీరకంగా ఇవ్వాల్సిన ఆనందాన్ని కూడా కొన్ని సార్లు ఇవ్వలేకపోతుంటాను. జాన్ నా వల్ల ఏదో లోటు ఉందని ఎప్పుడూ అనుకోకూడదు. అందుకే బయటి ఆడవాళ్లతో ఎంజాయ్ చేయమని నేనే చెప్పాను. అలా చెప్పడం వల్ల అతను నా వద్ద ఏదీ దాచడం లేదు. మామధ్య ఎలాంటి గొడవలు కూడా రావడంలేదు. అంతేకాదు జాన్‌కు నచ్చినట్లుగానే నేను ఇంట్లో ఉంటాను. అతను ఫలానా డ్రెస్ వేసుకో అని చెబితే నువ్వెవరు నాకు చెప్పడానికి అని మాత్రం అస్సలు అనను. ఎందుకంటే జాన్‌కి నచ్చినది నేను చేస్తే అతను ఎంతో సంతోషిస్తాడు. అతను సంతోషంగా ఉంటే నేనూ సంతోషంగా ఉంటా” అని వెల్లడించింది. ఇది చూసిన వాళ్లలో ఆడవారు ఇలాంటి మహిళలను ఎంకరేజ్ చేయొద్దు అని కామెంట్లు పెడుతుంటే మగవారు మాత్రం ఇలాంటి వైఫ్ ఉంటే ఎంత బాగుండోనని అంటున్నారు.