Marriage: దెయ్యంతో పెళ్లట.. ఇప్పుడు విడాకులు కావాలట!
Brikain: వెర్రి వెయ్యి రకాలంటారు. కొంతమంది మనుషులు చేసే పనులు చూస్తే నిజమే అనిపిస్తుంది(marriage with ghost). పై ఫొటోలో ఉన్న అమ్మాయిని చూసారా? క్యూట్‌గా ఉన్నా కాస్త భయంకరంగా ఉంది కదూ..! ఈ అమ్మాయి పేరు రాకర్ బ్రొకార్డ్. బ్రిటన్(britain)కు చెందిన రాకర్ చర్చి ఫాదర్ సమక్షంలో ఓ దెయ్యాన్ని వివాహం(marriage) చేసుకుందట. వింతగా ఉంది కదూ..! ఇలా చెప్తే ఎవ్వరూ నమ్మరని ఏకంగా వీడియో కూడా తీసింది. 2022 హాలోవీన్(halloween) సమయంలో ఓ దెయ్యాన్ని పెళ్లాడిందట. ఆ దెయ్యం పేరు ఎడ్వార్డో. పైగా అతనితో ఐదు నెలలు గడిపాక పెళ్లి చేసుకుందట.
ఆ తర్వాత రాకర్ ఎక్కడికి వెళ్లినా భర్త వెంటే వస్తున్నాడని టార్చర్ భరించలేక విసిగిపోయానని విడాకులు కావాలి అంటోంది. విడాకులు తీసుకోవడానికి భూతవైద్యం చేయించాలట. అంతేకాదు.. ఆ దెయ్యం విక్టోరియాకు చెందిన ఓ సైనికుడని చెప్తోంది. ఓ భూతవైద్యుడిని ఇంటికి పిలిపించి ప్రేయర్ చదివిస్తే విడాకులు అయిపోయినట్లే అని చెప్తోంది ఈ పిచ్చిది. ఇలాంటి ఘటన ఇంతకుముందు అమెరికాలో జరిగింది. ఓ యువతి ఏ అబ్బాయి తనకు నచ్చలేదని చెప్పి తనని తానే పెళ్లి చేసుకుంది. ఆ తర్వాత 24 గంటలకే విడాకులు కావాలని కోర్టుకు వెళ్లింది. రాకర్ బ్రొకార్డ్ పెళ్లి చేసుకున్న వీడియో కూడా ఉంది. ఈ వెర్రితనాన్ని మీరూ చూడండి..!