Train Accident: రైల్వే శాఖ మంత్రి రాజీనామా చేస్తారా?
Odisha: ఒడిశాలో చోటుచేసుకున్న ఘోర రైలు ప్రమాద ఘటన (train accident) తర్వాత కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ (ashwini vaishnaw) రాజీనామా చేస్తారా? అన్న విషయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ఎందుకంటే.. భారతీయ రైళ్లలో యాంటీ కోలిషన్ మెకానిజనం (కవచ్) ఎలా పనిచేస్తుందో ఒకప్పుడు వివరణ ఇచ్చింది ఈయనే. పైగా స్వయంగా తాను ప్రయాణించి మరీ పరిశీలించానని, ఇది సేఫ్ అని చెప్పింది కూడా ఆయనే. కానీ ఒడిశాలో చోటుచేసుకున్న మూడు రైళ్ల ప్రమాదంలో మాత్రం ఈ కవచ్ అనేది ఇన్‌స్టాల్ చేసి లేదు. మరి ఇది తన బాధ్యతే అనుకుని ఆయన తన పదవి నుంచి రాజీనామా చేస్తారా?
2017 ఆగస్ట్‌లో సురేష్ ప్రభు రైల్వే శాఖ మంత్రిగా ఉన్నప్పుడు ఇలాంటి రైలు ప్రమాదం ఒకటి చోటుచేసుకుంది. రెండు రైళ్లు గుద్దుకోవడంతో దాదాపు 25 మందికి పైగా దుర్మరణం చెందారు. దాంతో ఇది తన బాధ్యతేనని ఒప్పుకుంటూ రైల్వే శాఖ మంత్రిగా రాజీనామా చేసారు. మరి ఇప్పుడు అశ్విని వైష్ణవ్ కూడా రాజీనామా చేస్తారా లేదా అన్నది వేచి చూడాలి. మరోపక్క ప్రధాని నరేంద్ర మోదీ వివిధ శాఖల మంత్రులతో రివ్యూ మీటింగ్ ఏర్పాటుచేసారు. అసలు ఈ రైలు ప్రమాదం ఎలా జరిగింది అనే దానిపై సమీక్షిస్తున్నారు.